టాలీవుడ్ మన్మధుడు గా పేరు తెచ్చుకున్న నాగార్జున బిగ్ బాస్ నాలుగో సీజన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్ నాగార్జునతో ముచ్చటించాడు. సండే ఫండే కావడంతో ఇంట్లో జంబలకడిపంబ స్కిట్ నుఇంటి సభ్యులు ప్రదర్శించారు. ఆ తర్వాత ఇంట్లో మిగిలిన నామినేట్ అయిన సెలబ్రెటీలను నాగార్జున ఆడుకున్నారు.
ఇదే సమయంలో స్వాతి దీక్షిత్ బయటకు వచ్చిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళాల్సిన ఇంకొక సెలబ్రిటీ ఎవరో అంటూ కొంచెం టెన్షన్ పెట్టారు. ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ తో నాగార్జున గేమ్ ఆడించారు. నమ్మకద్రోహి, అహంకారి కార్డులను తీసుకొని సభ్యులకు ఆపాదిస్తే మెడలో ఆ కార్డులు వేసుకొని తీరాలని ఆయన చెప్పారు. దాంతో కార్డులను తీసుకుంటే స్వాతి దీక్షిత్ ఒక్కొక్కరికి ఆ కార్డులను ఇవ్వడం మొదలుపెట్టింది.
ఇదే సమయంలో జంబలకడిపంబ స్కిట్ లో భాగంగా అబ్బాయిలంతా అమ్మాయిల వేషం వేస్తే అమ్మాయిలు అబ్బాయిలు లాగా వచ్చి ఆటిట్యూడ్ చూపించారు. అందరికంటే లేడీ గెటప్ లో అందంగా ఆడపిల్లలు కూడా సైట్ కొట్టే విధంగా ఆడవేషం వేసిన సోహెల్ చూసి నాగార్జున ఫిదా అయిపోయాడు. చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు విసిరారు. నీలో ఈ కోణం కూడా ఉందా అంటూ కామెంట్ చేశారు. ఇక మగవాళ్ల రూపంలో ఉన్న ఫిమేల్ కంటెస్టెంట్స్ కూడా సోహెల్ పై మోజు పట్టారు.