Black Foods: బ్లాక్ ఫుడ్స్ తింటే శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలిస్తే మీరు కూడా అసలు వదలరు..!!

Share

Black Foods: ఒకప్పుడు అందరూ అన్ని రకాల ఆహార పదార్థాలను తినేవారు.. అయితే ఇప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడమే మరచిపోయారు.. కొంతమంది వాటి కలర్ ని చూసి వాటిని తినటానికి కూడా అస్సలు ఇష్టంపడటం లేదు.. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాలు చూడడానికి బాగో లేకపోయినా రుచిగా లేకపోయినప్పటికీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం మరిచిపోతున్నారు.. కంటికి ఇంపుగా కనిపించినవి నోటికి రుచిగా అనిపించింది మాత్రమే తింటున్నారు.. కలర్ బాగోలేక పోయినా రుచి గా అనిపించక పోయినా ఆ ఫుడ్స్ తినడానికి మక్కువ చూపించడం లేదు.. కలర్ బాగోలేనప్పుటికీ రుచిగా లేకపోయినా బ్లాక్ కలర్ ఫుడ్స్ (Black Colour Foods) మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి.. బ్లాక్ కలర్ ఫుడ్స్ తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం..!!

Different types of Black Foods: health benefits
Different types of Black Foods: health benefits

Black Foods: రంగును చూసి కాదు.. పోషకాలను చూసి ఆహారాన్ని ఎంచుకోండి..!!

బ్లాక్ కలర్ ఫుడ్స్ లో ఆంథోసైనిన్స్ ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తి (Immunity Power) ని పెంపొందించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలతో నైనా సమర్థవంతంగా పోరాడే శక్తి ఈ బ్లాక్ ఫుడ్స్ లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది మినప్పప్పు.. పూర్వకాలం నుండి మినప్పప్పును తో తయారు చేసిన వంటకాలను ప్రతి నిత్యం మనం తింటూనే ఉంటాం. ఇడ్లీ, అట్టు, గారే, పునుగు, సున్నుండలు ఇలా రకరకాల పదార్థాలను తయారు చేసుకుని తింటున్నాం. ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వదు. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది.

Different types of Black Foods: health benefits
Different types of Black Foods: health benefits

ఇటీవల కాలంలో నల్ల బియ్యం (Black Rice) కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో కూడా ఆంథోసైనిన్స్ (Anthosinens) ఉన్నాయి. ఈ బియ్యం తినడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హానికర బ్యాక్టీరియా వైరస్ చేరకుండా చూస్తుంది. ఈ బియ్యంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది మధుమేహాన్ని (Diabetes) తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. బ్లాక్ ఫుడ్స్ లో నల్ల నువ్వులు కూడా ఒకటి. ఇందులో బెల్లం కలుపుకుని తీసుకుంటే రక్తహీనతను తగ్గిస్తుంది. నల్ల నువ్వుల లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ సమృద్ధిగా ఉన్నాయి. నల్ల ద్రాక్ష ప్రతిరోజు తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. నల్ల ద్రాక్ష (Black Grapes) అన్ని రకాల సీజన్లలో లభిస్తుంది. కాబట్టి ఈ పండును ప్రతి రోజు తీసుకోవడం మంచిది. అలాగే బ్లాక్ బెర్రీస్ (Black Berries) రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.

Different types of Black Foods: health benefits
Different types of Black Foods: health benefits

మన వంటింట్లో నిత్యం నల్ల మిరియాలు దర్శనమిస్తుంటాయి. ఇవి కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జలుబు, దగ్గు, కఫం నివారించడానికి సహాయపడుతాయి. హానికర బ్యాక్టీరియా, వైరస్ ఎదుర్కొనడానికి ఇవి దోహదపడతాయి. పుట్టగొడుగులు తినడానికి ప్రజలు మక్కువ చూపిస్తున్నారు. ఇందులో నల్ల పుట్టగొడుగులు (Black Mushrooms) కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఉదర సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. కాలేయ (Liver) పని తీరును మెరుగు పరుస్తాయి. వీటితోపాటు ఎండు ఖర్జూరం, బ్లాక్ టీ (Black Tea), నేరేడు కాయలు, నల్ల సోయాబీన్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్లాక్ కలర్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయకండి. సాధ్యమైనంతవరకు మీ డైట్ లో భాగంగా చేసుకోవడానికి మీ ఆరోగ్యానికి ఇవి  బోనస్..


Share

Related posts

మీరు అధికారులా లేక అధికార నాయకులా!! ఈ కీచులటలు మీకే నష్టం

Comrade CHE

lips: మీ పెదవులు గులాబీ రేకులు లా మారాలా ?అయితే  పట్టు  వీడకుండా ఇలా చేసి  చూడండి!!

siddhu

బిగ్ బాస్ 4 : సోహెల్ కు బిగ్ బాస్ నుండి వచ్చిన అమౌంట్ మొత్తం తెలిస్తే కళ్ళు తిరగడం ఖాయం…!

arun kanna