Jr.NTR : తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్..!! వెండితెరపై మెరుపులు మెరుస్తూనే.. బుల్లితెరపై పలు షోలకు వ్యాఖ్యాతగా అలరిస్తున్నారు.. తాజాగా ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.. మరి ఈ షో కి జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..!!
తాజాగా శనివారం ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. రాజకీయాలకు ఎప్పుడు వస్తున్నారు అన్న ప్రశ్నకు నేరుగా నో చెప్పకుండా ఇప్పుడు ఇది సందర్భం కాదు అంటూ మాట దాటవేశారు. ఇదిలా ఉంటే ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి నెట్టింట్లో వైరల్ అవుతోంది.. ఈ షోకి ఎన్టీఆర్ ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.1.2 కోట్లు తీసుకోనున్నారని సమాచారం. ఎన్టీఆర్ ఈ షో కోసం మొత్తం 30 ఎపిసోడ్లు చేయనున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అక్షరాల రూ. 30 కోట్ల కు పైమాటే.. వెండితెరపై తన డైలాగులతో మెస్మరైజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రశ్నలు సంధిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.