Kidney Problems: కిడ్నీ సమస్యలకు, రాళ్ళూ కరగడానికి అద్భుత ఆయుర్వేదం ఇది..! ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..!!   

Share

Kidney Problems: మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపించేందుకు కిడ్నీలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి..!! ఇందుకోసం మనం నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి.. అలాగే కిడ్నీలను సురక్షితంగా ఉంచే ఆహారాలు తీసుకోవాలి.. కానీ కొందరిలో పలు కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తుంటాయి.. మన దేశంలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.. వీటన్నింటికి ప్రధాన కారణం మనం కిడ్నీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడమే.. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఈ ఆయుర్వేద చిట్కాలు ప్రయత్నిస్తే చక్కటి పరిష్కారం దొరుకుతుంది..!!

Kidney Problems: Best Home Remedies
Kidney Problems: Best Home Remedies

Kidney Problems: ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే కిడ్నీ వ్యాధులు పరార్..!!

కావలసిన పదార్థాలు:

తెల్ల గలిజేరు – 100 గ్రాములు, తిప్పసత్తు – 50 గ్రాములు, కొండపిండి – 50 గ్రాములు, శృంగి భస్మం – 20 గ్రాములు, కర్పూర శిలాజిత్ – 20 గ్రాములు, పచ్చ కర్పూరం – 2 గ్రాములు, ఉసిరికాయ పొడి – 50 గ్రాములు, చందనం చూర్ణం – 50 గ్రాములు, తవాక్చిరి – 50 గ్రాములు, గొక్చురా – 50 గ్రాములు.

ముందుగా ఈ ఈ ఔషధాలన్నీ సేకరించి శుభ్రం చేసి అన్నింటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడులన్నింటిని కలుపుకొని ఈ పొడికి సరిపడినంత నెయ్యి పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక స్పూన్ మజ్జిగలో కలిపి తీసుకోవాలి. లేదనుకుంటే అలోవెరా జ్యూస్ లో కలిపి తీసుకోవచ్చు. ప్రతిరోజు ఈ చూర్ణాన్ని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఈ చూర్ణం తీసుకోవడం వలన అన్ని రకాల మూత్ర సమస్యలు, మూత్రం మంట, ఆయాసం బలహీనత , నిస్సత్తువ రాకుండా చూస్తుంది. ఈ ఈ చూర్ణాన్ని తీసుకున్న అన్ని రోజులు కచ్చితంగా పత్యం చేయాలి. ఎక్కువగా వేడి చేసే వస్తువులు, బంగాళదుంప, కంద, చిలకడ దుంపలు తీసుకోకూడదు . మాంసాహారం ఎక్కువగా మసాలా ఉన్న పదార్థాలు తినకూడదు. ఈ పత్యాన్ని పాటిస్తూ ఈ చూర్ణాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

Kidney Problems: Best Home Remedies
Kidney Problems: Best Home Remedies

Kidney Problems: కిడ్నీ సమస్యలతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారం..!!

ప్రతిరోజు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లను, కూరగాయలను మీ డైట్లో భాగం చేసుకోవాలి. అలాగే ఉప్పు ఎక్కువగా వాడకూడదు. మనం సాధారణంగా ప్రతిరోజు 7 నుంచి 10 గ్రాముల ఉప్పును వాడటం. అదే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నాలుగు నుంచి ఐదు గ్రాముల ఉప్పును మాత్రమే వాడాలి. ఉప్పును లో సోడియం అధికంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇవి తిన్న కూడా ఎక్కువ సేపు ఆకలి వేయదు. జంక్ ఫుడ్స్ ను మానుకోవాలి. అధిక రక్తపోటు షుగర్ సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. కిడ్నీ సమస్యలు తలెత్తడానికి ఇవి కూడా ఒక కారణమే. షుగర్ బీపీ లేదా ఇతర ఏ మందులనైనా ఎక్కువగా వాడకుండా ఆయుర్వేద చిట్కాలు ప్రయత్నించడం మంచిది. నొప్పులను తగ్గించే ఎక్కువగా వేసుకున్నా కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి.

ఎక్కువసేపు వ్యాయామం చేయకూడదు. రోజుకి గంట లేదా రెండు గంటలకు మించి ఎక్కువ సేపు వ్యాయామం చేసినా కూడా ఇబ్బందుల్లో పడతారు. కిడ్నీ సమస్యలు ముందుగానే గుర్తించడం మంచిది ఈ సమస్య వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి వాటిని గుర్తించగలిగితే సమస్యకు ముందుగానే పరిష్కారం చెప్పవచ్చు కిడ్నీ సమస్యలు వచ్చే ముందు మూత్ర సమస్యలు, త్వరగా మూత్రం రావడం, అలసట, నీరసం, తలనొప్పి, వాంతులు, వికారం, నడుం నొప్పి, వెన్ను నొప్పి, కడుపు నొప్పి, కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం మంచిది.


Share

Related posts

IND v ENG : ఈ రోజు మ్యాచ్ లో వీరిద్దరే కీలకం ! క్లిక్ అయితే ఇంగ్లండ్ ఖేల్ ఖతం

arun kanna

Ex MP Chinta Mohan: మరో సారి సంచలన కామెంట్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్..!!

somaraju sharma

సిఇఒ ద్వివేది బదిలీ

somaraju sharma