NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా ఎఫెక్ట్: ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళాలు..! ఎక్కడంటే..?

లాక్ డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత కరోనా రక్కసి ప్రభావం అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ లు వస్తున్నాయి.  కరోనాకు సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేకుండా అందరినీ హడలెత్తిస్తోంది. ఎవరి ద్వారా కరోనా వైరస్ అంటుకుంటుందో తెలియక భయం భయంతో ప్రజలు జీవనం సాగిస్తున్నారు.

నెల్లూరు, ఏలూరులో పోలీస్ శాఖను కరోనా హడలెత్తిస్తోంది. నెల్లూరులో ఏకంగా పోలీస్ స్టేషన్ నే మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ ఐ సహా ఏడుగురు కానిస్టేబుళ్ల తో పాటు పీఎస్ లో పనిచేసే స్వీపర్లకూ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పోలీస్ స్టేషన్ ను మూసి వేశారు. ఓ హత్య కేసులో నిందితులను ఎలాంటి పరీక్షలు జరపకుండా స్టేషన్ తీసుకువచ్చి విచారించిన నేపథ్యంలోనే వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో అందరికీ కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు.

కాగా పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులను  కరోనా ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే విధంగా ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మరో 10 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వీరందరిని ఏలూరు ఆశ్రమ హాస్పటల్ లో ఐసోలేషన్ కి తరలించారు. దీనితో పోలీస్ సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

గత వారం రోజులుగా రాష్ట్రంలో నిత్యం ఏడు వందలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 17,699 మంది కరోనా బారిన పడగా 218 మంది మృతి చెందారు. 8008 మంది వైద్య సేవల అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju