NewsOrbit
న్యూస్

అప్పుడు స్లిప్పులు -ఇప్పుడు తిప్పలు ! పితానిని పీకల్లోతు ముంచేసిన పుత్రరత్నం !

టిడిపి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పుత్రరత్నం నిర్వాకం ఒకటి తాజాగా బయటకొచ్చింది.ఆయన పంపే స్లిప్పుల బాగోతం వెలుగుచూసింది.దీంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది.


ఈఎస్‌ఐ లో కార్మికుల కడుపు కొట్టి రూ.కోట్లు కొట్టేసిన అప్పటి నేతల అవినీతి ఒక్కొక్కటే బయటకు వస్తున్న సమయంలో… ఏజెన్సీల నుంచి వచ్చే కమీషన్ల కోసం కక్కుర్తి పడి, నాణ్యతను గాలికొదిలేసి, కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టిన వ్యవహార౦ లో గత ప్రభుత్వంలోని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో,ఆయన కుమారుడి ఆధ్వర్యంలో స్లిప్పుల విధాన౦లో జరిగిన వ్యవహారం బయటికొచ్చింది.


వివరాళ్లోకి వెళ్తే… 2016లో తయారైన పారాసెటిమాల్‌ మాత్రలు 2019 ఆగస్ట్ ‌తో ఎక్స్‌పెయిరీ అవుతాయన్న ఉద్దేశంతో.. ఆదరాబాదరాగా 2019 ఫిబ్రవరిలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సరఫరా చేశారట. అయితే.. ఈ మాత్రలు పనికిరానివని, సరఫరా చేసిన ఏజెన్సీని రద్దుచేయండని ఔషధ నియంత్రణ శాఖ ఒక నివేధిక ఇవ్వగా… ఆ నివేదికను మంత్రి పితాని ఒత్తిడి మేరకు చెత్తబుట్టలో వేశారంట.


2019 ఫిబ్రవరిలో ఈ మాత్రలను పరిశీలించిన అనంతరం.. ఇవి నాసిరకం అయినవంటూ తిరుపతి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నివేదిక ఇచ్చినా.. అప్పటి మంత్రి పితాని ఒత్తిళ్ల మేరకు నాటి ఈఎస్ఐ డైరెక్టర్‌ చర్యలు తీసుకోలేదట! అనంతరం ఈ మందులు సరఫరా చేసిన ఏజెన్సీని కాపాడేందుకు మంత్రి తీవ్రంగా యత్నించినట్టు తెలుస్తోంది.


ఇవన్నీ ఒకెత్తు అయితే… ఈ వ్యవహారంలో పితాని పుత్రరత్నం వెంకట సురేష్‌… కీ రోల్ పోషించినట్లుగా చెబుతున్నారు.తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన భారీగానే సంపాదించాడని అంటున్నారు! ఈ విషయాలపై స్పందించిన కొందరు ఈఎస్ఐ అధికారులు… మంత్రి కొడుకు స్లిప్పులు రాసి తమకు పంపించేవారని… వాటి ఆధారంగా కాంట్రాక్టులో లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోళ్లు చేశాం అని… బిల్లుల చెల్లింపుల్లోనూ స్లిప్పులు రాసి పంపించేవారని… పని అయిన అనంతరం ఆ స్లిప్ లను చించేసేవాళ్లం అని చెప్పుకొచ్చారు.ఇదీ మ్యాటర్…! అనగా హవాలా మొదలుకొని స్లిప్పుల వరకు అవినీతికి మార్గాలు ఉన్నాయన్న మాట!

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N