NewsOrbit
న్యూస్

జగన్ అత్యంత సన్నిహిత మంత్రి… తెలీకుండా జగన్ కే డ్యామేజ్ చేస్తున్నాడు?

తాజాగా ఏపీ రాజకీయాల్లో ఒక మంత్రి గురించి గతకొన్ని రోజులుగా అటు పార్టీలోను, కేబినెట్ లోనూ, ఇటు జిల్లాలో కూడా విచిత్రమైన చర్చ నడుస్తోంది. వైసీపీలో కీల‌క నేత‌, పార్టీలో ఒక‌ర‌కంగా ఫైర్ బ్రాండ్‌ గా గుర్తింపు పొందిన నాయ‌కుడు, ఉత్సాహవంతుడు కావ‌డంతో.. జ‌గ‌న్ త‌న కేబినెట్ ‌లో అవ‌కాశం క‌ల్పించారు. అయితే ఈ మంత్రిగారు మొత్తం జిల్లా రాజ‌కీయాల‌ను త‌న క‌నుస‌న్నల్లో ఉండేలా చేసుకుంటున్నారని.. స్థానికంగా ఉన్న ఓ బ‌ల‌మైన వ‌ర్గాన్ని సైతం త‌న క‌నుసైగ‌ల్లో న‌డిపిస్తున్నార‌ని అంటున్నారు. ప్రస్తుతం ఈ కారణంగానో ఏమో కానీ.. ఆయనపై ఒకరకమైన అక్కసును ఆ వర్గం వారు వ్యక్తపరుస్తున్నారని అంటున్నారు!

బీసీ సామాజికవర్గానికి చెందిన ఈ మంత్రి… ఏ విషయంపై అయినా ముందు తొడగొట్టేస్తాడు, అనంతరం ఆలోచిస్తాడు అనే విమర్శను మాత్రం సంపాదించుకున్నారంట. ప్రస్తుతం ఇదే ఈయనకు కాస్త ఇబ్బందిని తెస్తున్నాయని అంటున్నారు. విమర్శల వరకూ మా జిల్లా మంత్రికి ఫుల్ మార్కు వేయగలం కానీ.. సబ్జెక్ట్ విషయానికొచ్చే సరికి మాత్రమే పాస్ మార్కుల వరకూ నెట్టుకురాగలుగుతున్నారని కామెంట్ చేస్తున్నారు!

ఈ క్రమంలో జిల్లాలోని ఒక బలమైన సామాజిక వర్గం మొత్తంగా ఆయ‌న‌ను టార్గెట్ చేసేందుకు ప్రయ‌త్నిస్తోంద‌ని తెలుస్తోంది. కేవలం ఆ వర్గానికి చెందిన సీనియర్లను కాదని.. జగన్ ఈయనకు మంత్రి పదవి ఇవ్వడంపై వారంగా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ పై ఉన కోపాన్నో, అలకనో.. ప్రస్తుతం ఈ మంత్రిపై తీర్చుకుంటున్నారని అంటున్నారు స్థానికులు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే… స‌ద‌రు మంత్రి సీఎంకు అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉండ‌డంతో.. సదరు వ‌ర్గం కక్కలేక మింగలేక ఇబ్బందిపడుతున్నారని తెలుస్తోంది!

మరీ అన్నీ బాగున్నాయి.. రాజకీయాల్లో బోలెడంత భవిష్యత్తు ఉంది.. వైకాపా అధికారంలో ఉన్నంత కాలం ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.. కాబట్టి.. ఈ సమయంలో వీలైనంతవరకూ సబ్జెక్ట్ పై కూడా కాన్సంట్రేషన్ చేస్తూ.. అన్ని వర్గాలనూ కలుపుకుంటూపోతే అటు ఆయనకు మంచిది కావడంతోపాటు.. తనను నమ్మిన అధినేతకు కూడా కొత్త ఇబ్బందులు లేకుండా చేయగలరని సూచనలు మాత్రం జిల్లా వ్యాప్తంగా వస్తున్నాయి!! మంత్రివర్యుల పేరు ప్రస్థావన సంగతి కాసేపు పక్కనపెడితే… కోస్తాంధ్ర, రాయ‌ల‌సీమ జిల్లాల‌కు బోర్డర్ ఉండే ఓ జిల్లాకు చెందిన మంత్రి అని మాత్రం హింట్ వస్తోంది!!

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N