NewsOrbit
దైవం

ఆసిఫాబాద్ లో ఉన్న ఈ ఆంజనేయ గుడి చాలా చాలా స్పెషల్ !

ఆసిఫాబాద్ లో ఉన్న ఈ ఆంజనేయ గుడి చాలా చాలా స్పెషల్ !

 శ్రీ రామదూత ,  ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుద‌నే చెప్పాలి.ఇంకా  చెప్పాలంటే దాదాపు ప్ర‌తి గ్రామంలోనూ హ‌నుమంతుడి ఆల‌యం ద‌ర్శ‌నిమిస్తుంది. అలాంటి వాటిలో టోంకినీ అంజన్న ఆల‌యం కూడా ఒక‌టి.

ఆసిఫాబాద్ లో ఉన్న ఈ ఆంజనేయ గుడి చాలా చాలా స్పెషల్ !

ఈ  ఆలయం అన్ని ఆలయాలకన్నా భిన్నమైనది. ఈ ఆల‌యంలో ఎన్నో ప్రత్యేక‌త‌లు దాగున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..హనుమాన్ ఆలయం ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్–టీ మండలం టోంకినీలో ఉంది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.  పురాతన కాలంలో వార్ధా నదిలో అంజన్నవిగ్రహం బయటపడింది. భక్తులతో నిత్య పూజలు అందుకుంటూ కోర్కెలు తీర్చే కల్పతరువుగా మారాడు అంజనీ సుతుడు. ఆలయానికి సుమారు ఏడు కిలో మీటర్ల దూరంలో వార్ధా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది. ఆలయ ముఖ ద్వారం పడమర వైపు ఉంది. కానీ.. ఈ  విగ్రహం మాత్రం దక్షిణాభి ముఖంగా ఉంటుంది . అలాగే ఈ ఆల‌యంలో అంజ‌న్న‌ విగ్రహం పరిమాణం ఏటేటా పెరుగుతుండడం మ‌రో విశేషంగా చెప్పొచ్చు. అంతేకాదు, ఇక్కడ ఆలయం కట్టకముందు వర్షాకాలం వస్తే చాలు వరదలతో ఆ గ్రామం మునిగిపోయేద‌ట‌. కానీ.. ఎప్పుడైతే అంజ‌న్న‌ ఆలయం క‌ట్టారో,అప్ప‌టి నుంచి ఎంత వర్షం వచ్చినా ఊరు మునిగిపోవడం లేదు. ఎంత వరద వచ్చినా నీళ్లు ఆలయం మెట్ల దాకా వచ్చి ఆగిపోతున్నాయని అక్క‌డ‌ గ్రామస్తులు అంటున్నారు. అలాగే ఇక్క‌డ అంజన్నకు ముడుపు కడితే కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని భక్తులు న‌మ్ముతారు.

అందుకే  ఆయనని ముడుపుల హనుమాన్‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా పిలుస్తుంటారు. మ‌రియు అంజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులంతా కలిసి ప్రతి సంవత్సరం మహా పాదయాత్ర కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ  హనుమంతుని మహిమ తెలిసిన భ‌క్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకుని పునీతులవుతున్నారు.మహా పాదయా త్ర , హనుమాన్ జయంతి వేడుకలకు వచ్చే భక్తులతో గుడి ప్రదేశం, రోడ్లు నిండిపోతుంటాయి.

Related posts

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju