NewsOrbit
న్యూస్

కార్ల‌ను క‌డిగే విద్యార్థి.. సీబీఎస్ఈలో 91.7 శాతం మార్కులు సాధించాడు..

దేశంలో ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు స‌రైన ఆద‌ర‌ణ లేక చ‌దువుకోవ‌డం మానేస్తున్నారు. కొంద‌రు స్వ‌శ‌క్తితో ఎదుగుతూ విద్యాభ్యాసం కొన‌సాగిస్తున్నారు. ఓవైపు పార్ట్ టైం ప‌నులు చేస్తూనే.. మ‌రోవైపు విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల ప‌ర‌మేశ్వ‌ర్ కూడా ఒక‌డు. ఇత‌ను ఆ న‌గ‌రంలోని ఓ మురికివాడ‌లో నివాసం ఉంటున్నాడు. క‌టిక పేద‌రికం అనుభ‌విస్తున్నాడు. అయినా.. సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల్లో మెరుగైన ఉత్తీర్ణ‌త సాధించాడు.

this delhi student washes cars and achieved 91 percent in cbse 12th class

ప‌ర‌మేశ్వ‌ర్‌కు కుటుంబం ఉంది. సోద‌రులు కూడా ఉన్నారు. కానీ వారికి సొంత కుటుంబాలు ఉన్నాయి. అయినా వారికి కూడా స్థిర‌మైన ఆదాయం లేదు. మ‌రోవైపు ప‌ర‌మేశ్వ‌ర్ తండ్రి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో అత‌ను కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్నాడు. అక్క‌డే ఓ కార్ల వాషింగ్ షెడ్డులో ప‌నిచేయ‌డం మొద‌లు పెట్టాడు. నిత్యం ఉద‌యాన్నే 4 గంట‌ల‌కు లేస్తాడు. 2 నుంచి రెండున్న‌ర గంట‌ల పాటు ప‌ని ఉంటుంది. త‌రువాత స్కూల్‌కు వెళ్తాడు. వారంలో 6 రోజుల పాటు ప‌ని ఉంటుంది. రోజుకు 10కి పైగా కార్ల‌ను వాష్ చేస్తాడు. నెల‌కు రూ.3వేల వర‌కు అత‌నికి ఇస్తారు. దాంతోనే అత‌ను ఓవైపు త‌న కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మ‌రోవైపు విద్యాభ్యాసం కొన‌సాగిస్తున్నాడు.

ఇక చ‌లికాలంలో అయితే ప‌ర‌మేశ్వ‌ర్ ప‌డే అవ‌స్థ అంతా ఇంతా కాదు. నీటికి చేతి వేళ్లు గ‌డ్డ‌క‌ట్టుకుపోతాయి. అయినా అత‌ను ప‌నిచేయ‌డం ఆప‌లేదు. ఇక మార్చి నెల‌లో త‌న తండ్రి హాస్పిట‌ల్ పాల‌య్యాడు. అయిన‌ప్ప‌టికీ అత‌ను ఓ వైపు తండ్రిని హాస్పిట‌ల్‌లో చూసుకుంటూనే మ‌రోవైపు కష్ట‌ప‌డి చ‌దివి ప‌రీక్ష‌లు రాశాడు. తాజాగా ప్ర‌క‌టించిన సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో ఏకంగా 91.7 శాతం మార్కులు సాధించాడు. త‌న జీవిత ల‌క్ష్యం ఏమిటో మీడియాకు అత‌ను తెలియ‌జేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ అత‌ని ప‌ట్టుద‌ల చూస్తుంటే త‌ప్ప‌కుండా అత‌ను ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటాడ‌ని మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju