NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

వివేకా హత్య కేసు:సిబిఐ అనుమానితుల జాబితాలో ఎవరెవరంటే..??

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముమ్మరం చేసింది. అందులో కీలకంగా ఉన్న అనుమతులు జాబితాను సిద్ధం చేసుకుంది. ఒక 15 మందిని అనుమానితులుగా చేర్చి దశల వారీగా వారిని విచారించనుంది. దీనిలో భాగంగానే పలు ప్రాధమిక సమాచారం రాబట్టేందుకు వివేకా కుమార్తె సునీతను నిన్న పిలిపించి విచారించారు. కడప సెంట్రల్ జైలు లోని అతిధి గృహాన్ని కేంద్రంగా చేసుకొని సిబిఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ రోజు నుండి దర్యాప్తు మరింత కీలకం కానుంది.
ఎవరెవరిని ఎప్పుడు పిలిపిస్తారు? ఎవరిని అనూహ్యంగా కస్టడీలోకి తీసుకుంటారో అనేది మాత్రం సందేహంగా మారింది. కొన్ని అరెస్ట్ లు కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా సిబిఐ అధికారులు ఇప్పటికే పులివెందులలో వివేకా ఇంటిని జల్లెడ పట్టారు. అణువణువు పరిశీలించారు. వివేకా ఇంటి వాచ్ మెన్, ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ, డ్రైవర్ ప్రసాద్, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సహా పలువురుని విచారించిన సిబిఐ అధికారులు… వివేకా కుమార్తె తెలిపిన వివరాలు, విచారణలో వచ్చిన అంశాల ఆధారంగా ఎవరెవరిని విచారించాలనే దానిపై ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

సిబిఐ అధికారులు విచారించాల్సిన జాబితాలో కడప ఎంపి వైఎస్​ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వై ఎస్ భాస్కర్ రెడ్డి, బాబాయ్ వై ఎస్ మనోహర్ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది.

ఎన్నికలకు ముందు వివేకా హత్య జరిగినా ఇంత వరకు సిట్ దర్యాప్తు లో దోషులను గుర్తించలేక పోయారు. ఏపి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju