NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఆ నిధి..ఆ స్వామిజీదా…!! ఆశ్రమంలో కొట్టేసినదా..!!

అనంతలో బయటపడ్డ ఆ నిధి వెనుక బడా వ్యక్తులు

ట్రంకు పెట్టల్లో నిధి గుర్తించిన పోలీసులు..ఆరా

అనంతపురం జిల్లాలో బయట పడిని నిధి వ్యవహారం ఇప్పుడు ఆసక్తి కర మలుపులు తిరుగుతోంది. బుక్కరాయ సముద్రంలని ఒక ఇంట్లో నిధులు ఉన్న పెట్టెలు బయటపడ్డాయి. అనంతపురం ట్రెజరీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే మనోజ్ విలాసవంతంగా జీవినం సాగిస్తున్నారు. ఆయనకు నాలుగు కార్లు..అయిదు గుర్రాలు ఉన్నాయి. డ్రైవర్ గా నాగలింగం అనే వ్యక్తిని నియమించుకున్నాడు. ఇంతలో మనోజ్ కు తన భార్యతో విభేదాలు రాగా.. తన భార్యను..ఆమె తరపు వారిని మనోజ్ రివాల్వర్ తో బెదిరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ రివాల్వర్ పై కూపీ లాగగా.. అది తన డ్రైవర్ నాగలింగంకు అప్పగించినట్లుగా బయటకు వచ్చింది. ఆ రివాల్వర్ కోసం నాగలింగం మామ బాలెప్ప నివాసంలో పోలీసులు సోదాలు చేసారు. ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టలు ఉండటం..వాటికి సీలు వేసి ఉండటం గమనించారు. వాటిని తెరవగా భారీ వెండి సామాగ్రితోప ాటుగా నగలు..నగదు బయట పడ్డాయి. రెండు రివాల్వర్లు దొరికాయి. దీనికి సంబంధించిన స్వాధీనం చేసుకున్న వాటి పైన పోలీసులు ప్రకటన చేసారు. అయితే, ఇదంతా ఒక స్వామిజీకి చెందినదా..లేక ఆ స్వామీజీ ఆశ్రమం నుండి కొట్టేసినదా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Police traced Gold and silver treasure in Anantapur started investigation
gold, silver seazed

పోలీసులకు దొరికిన భారీ సొత్తు..

ఈ సోదాల్లో పోలీసులకు 2,420 గ్రాముల బంగారం..84 కిలోల వెండి..49 లక్షల 10 వేల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన బాండ్లు..27 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు..15 లక్షల 55 వేల నగదు తో పాటుగా 3 పిస్తోల్లు..ఒక ఎయిర్ రివాల్వర్ దొరికినట్లుగా పోలీసులు బయట పెట్టారు. రెండు కార్లు..7 ద్విచక్ర వాహనాలు..4 ట్రాక్టర్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సీజ్ చేసి బాలప్ప మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ మనోజ్ ఒక స్వామీజీకి సన్నిహిత భక్తుడుగా చెబుతున్నారు. ఈ సొమ్ముతో ఆ స్వామీజీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా.. లేక మనోజ్ ఆ స్వామిజీకి తెలియకుండా దీనిని కొట్టేసారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. మైసూరు కేంద్రంగా ఉండే ఆ స్వామిజీ ఆశ్రమం నుండి వీటిని తీసుకొచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆ ఆశ్రమ నిర్వహకులే ఇక్కడ ఉంచారా.. లేక వీరు కొట్టేసుకొచ్చారా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఇక, మనోజ్ కు స్థానికంగా రాజకీయ నేతలు.. పోలీసులతో సత్సంబంధాలు ఉన్నాయని..సస్పెన్షన్లు..బదిలీల విషయంలో పైరవీలు చేస్తుంటారని చెబుతున్నారు. దీంతో…ఇప్పుడు బుక్కరాయ సముద్రంలో దొరికిన ఆ నిధి..ఆ స్వామిజీతో ఉన్న లింకుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N