NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

నాకు ఎంత అప్పు ఉందో లెక్కలేసుకోవడానికి కూడా భయమేసింది: నాగబాబు

Nagababu views on money in youtube video

నాగబాబు.. పడి లేచిన కెరటం. అవును.. చిరంజీవి తమ్ముడిగానే కాకుండా ఆయన సొంతంగా ఎంతో కష్టపడ్డారు. నటుడిగా ప్రయత్నించారు. నిలదొక్కుకోలేకపోయారు. నిర్మాతగా మారారు. చేతులు కాల్చుకున్నారు. ఉన్న ఇంటిని కూడా అమ్ముకునే స్థితికి చేరుకున్నారు. అప్పులు మీదపడి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేమాదిరిగా ఉండవు కదా.

Nagababu views on money in youtube video
Nagababu views on money in youtube video

ఓడలు బండ్లు అవుతుంటాయి.. బండ్లు ఓడలు అవుతుంటాయి. అలాగే నాగబాబు ప్రస్తుతం ఆర్థికంగా స్థిరపడ్డారు. నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. తన కొడుకు కూడా హీరో అయ్యాడు. ప్రస్తుతం ఎటువంటి సమస్యా లేదు.

నాగబాబు ఈ మధ్య మన చానెల్ మన ఇష్టం.. పేరుతో ఒక యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చానెల్ లో ఎప్పుడూ ఏదో ఒక వీడియో పెడుతుంటారు. తన వ్యక్తిగత విషయాలను కూడా అందులో షేర్ చేస్తుంటారు నాగబాబు.

తాజాగా కోట్లు సంపాదించడం ఎలా? అంటూ ఓ వీడియోను రూపొందించారు. దానికి సంబంధించిన ప్రోమోను కూడా ఆయన రిలీజ్ చేశారు.

మనిషికి డబ్బు చాలా ముఖ్యం. ఎన్ని పనులు ఉన్నా.. డబ్బు సంపాదించడం అనేది గ్రెటెస్ట్ పని. ప్రేమానురాగాలు.. అనుబంధాలు.. అంటూ అందరూ సొల్లు మాట్లాడుతుంటారు కానీ.. డబ్బు లేకుంటే కనీసం ఇంట్లో పెళ్లాం కూడా గౌరవం ఇవ్వదు అంటూ నాగబాబు వీడియోలో చెప్పుకొచ్చారు. ఓ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వ్యక్తిగత జీవితం గురించి కూడా నాగబాబు చెప్పుకొచ్చారు.

అలాగే.. తన గురించి కూడా చెప్పారు. నేను ఒకానొక టైంలో నాకు ఎంత అప్పు ఉన్నదో చూసుకోవడానికి కూడా చాలా భయం వేసింది. మనోళ్లు ఉన్నారు కదా.. ఎలాగోలా మేనేజ్ చేస్తారులే అనుకున్నా. కానీ.. అలా అప్పులు చేసి నేను ఎంత దెబ్బతిన్నానో నాకు తెలుసు. ఒక్క పైసా సంపాదించకుండా ఇంట్లో ఊరికే కూర్చొని ఉండగలమా? అసలు బాధ్యతలను నెరవేర్చనోడిని ఎవరు పట్టించుకుంటారు. కన్న తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు.. అంటూ తన గతాన్ని నెమరు వేసుకున్నారు నాగబాబు.

ప్రోమోలో ఇంకా ఆయన ఏమన్నారో మీరే చూడండి..

Related posts

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju