NewsOrbit
న్యూస్

నేరుగా వాళ్ల ఖాతాలోకే ! జగన్ డేరింగ్ నిర్ణయంతో ఉలిక్కిపడ్డ ‘డబ్బునోళ్లు’!!

జగన్ ప్రభుత్వం విద్యార్థుల ‘ఫీజు రీయింబర్సుమెంట్’ నగదుని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమచేయాలని తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని ప్రశంసల వర్షం కురుస్తోంది.

jagan daring decission direct to your accounts
jagan daring decission direct to your accounts

ఈ నిర్ణయం కారణంగా పేద విద్యార్థులకు, ప్రత్యేకించి ఎస్సి, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్నిరకాల వేధింపులనుండి విముక్తి కలిగిస్తుంది.జగన్ తండ్రి ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు కూడా పెద్ద పెద్ద చదువులు అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో ఈ ఫీజురియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే.1990 దశకంలో విస్తృతంగా వచ్చిన ఇంజనీరింగ్ మరియు మెడికల్ కళాశాలల్లో ఇంజనీరింగ్, మెడికల్ విద్య అందని ద్రాక్షగానే మిగిలింది.ఇంటర్ తర్వాత పేద కుటుంబాల పిల్లలు సాంప్రదాయ కోర్సులకు పరిమితమైన రోజుల్లో డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్ పధకం ప్రవేశపెట్టారు.

ఈ పథకంతో రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ మరియు మెడికల్ కళాశాలలు పేదల పిల్లలకు మొదటిసారిగా ద్వారాలు తెరిచాయి. పెద్ద సంఖ్యలో పేదల పిల్లలు ఇంజనీరింగ్, మెడికల్ విద్య మొదలుపెట్టారు. సమస్య ఇక్కడే మొదలయింది. విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చిన కొన్ని కార్పొరేట్ కళాశాలలు ‘ఫీజు రీయింబర్సుమెంట్’ దరఖాస్తులన్నీ పూర్తయ్యాక, లేదా ప్రభుత్వం నుండి నేరుగా ‘ఫీజు రీయింబర్సుమెంట్’ సొమ్ము తమ ఖాతాలో పడిన తర్వాత అసలు సమస్య మొదలయ్యేది.ఫీజు రీయింబర్స్మెంట్ పొందిన విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు ,తోటి డబ్బున్న విద్యార్థులు చులకనగా చూసేవారు… అవమానించే వారు… ర్యాగింగ్ చేసేవారు… రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవారు. కళాశాల యాజమాన్యాలు అదనపు ఫీజులు అడిగేవి. చదువుపై ఇష్టంతో ఈ కష్టాలన్నీ భరించే వారు.

ఇంకొందరు కాలేజీ మానేసేవారు. ఇంకో కాలేజీలో చేరాలంటే సదరు విద్యార్థి సర్టిఫికెట్లు ఇచ్చేవారు కాదు. ఇది అన్ని చోట్లా జరిగిందని కాదు. చాలా చోట్ల జరిగింది. అయితే ఇవన్నీ లోలోపలే జరిగిపోయేవి కాబట్టి చాలామందికి ఫీజురియంబర్స్మెంట్ పొందిన విద్యార్థుల అవస్థలు తెలిసేవి కావు ఇలాంటి అవమానాలు వేధింపులు తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా జరిగాయి.మొత్తంమీద ఇవన్నీ ఎలాగో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వచ్చాయి దీంతో ఆయన కళాశాల యాజమాన్యాలకు కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజురియంబర్స్మెంట్ నగదు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు ఇందువల్ల కళాశాల యాజమాన్యాలు తప్పనిసరిగా ఫీజు రియంబర్స్మెంట్ పొందిన విద్యార్థులను గౌరవించాల్సి వుంటుంది

ఎందుకంటే ఇప్పుడు ఫీజు డబ్బు విద్యార్థుల దగ్గర ఉన్నది వారికి అవమానాలు జరిగితే ఆ కళాశాలలో కూడా ఉండకుండా వెళ్లిపోయే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది .దీనివల్ల నష్టం కళాశాల యాజమాన్యానికి కాబట్టి వారు ఇక బుద్ధిగా ఫీజురియంబర్స్మెంటు పొందిన విద్యార్థులను గౌరవంగా చూస్తారనడ౦ లో సందేహం లేదు!అందుకే ముఖ్యమంత్రి జగన్ కి అన్ని వర్గాల పేద విద్యార్థుల నుండి అభినందనలు అందుతున్నాయి .

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju