NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మ‌త క‌ల్లోలాలు…బాబు జ‌మానాలో అస్స‌లు జ‌ర‌గ‌లేదా?

chandrababu naidu implementation for debts

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. chandrababu naidu implementation for debts

ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం పాల‌న‌లోని సంఘ‌ట‌నల సంగ‌తి ఏంటి అనే ప్ర‌శ్న‌ను వైసీపీ వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే, దానికి తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. త‌మ హ‌యాంలో అంతా బాగుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

వైసీపీ స‌ర్కారులో…
వైసీపీ ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై చంద్ర‌బాబు మండిప‌డ్డారు. “పిఠాపురంలో 6 దేవాలయాలలో 23 విగ్రహాలను ద్వంసం చేశారు. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో వెంకటేశ్వర స్వామీ రధాన్ని దగ్ధం చేశారు. అంతర్వేధిలో రధాన్ని కాల్చేశారు.
ఇన్ని సంఘటనలు జరిగినా ఏ మాత్రం జాగ్రత్త లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రశ్నించిన వారిపై ఎదురు దాడి చేయటం వైసీపీ కి అలవాటుగా మారింది. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో రథానికి ఉండే మూడు వెండి సింహాలు మాయమైతే ఈఓ ఇప్పటి వరకు కేసు కూడా నమోదు చేయలేదు. నాలుగో సింహాన్ని లాగేదానికి ప్రయత్నించి రాకపోవడంతో వదిలిపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. “ అంటూ చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

జ‌గ‌న్‌, ఆ మంత్రిపై
దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతున్న తీరు నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉందని మండిప‌డ్డారు. “నీచంగా వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. కేక వేస్తే వినపడే దూరంలో ఎండోమెంట్ రిజిస్ట్రార్ ఆలయం సమీపంలోనే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు. నిడమానూరులో షిర్డీ సాయిబాబా విగ్రహాన్ని ద్వంసం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయ భూములకు సంబంధించి 6 అక్రమాలు జరిగాయి. దేవాలయ ఆస్తులు, ఆదాయాలకు సంబంధించి 9 అక్రమాలు జరిగాయి. ఆలయాల కూల్చివేతలు 12 జరిగాయి. అన్యమత ప్రచారాలు 13 జరిగాయి. అర్చకులపై వేదింపులు 2 జరిగాయి. గోశాలలో గోవులు చనిపోయిన సంఘటనలు 3 జరిగాయి. ఇలాంటివి మొత్తం దాదాపు 80 సంఘటనలు జరిగాయి. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు?. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన సంస్కృతి, బాధ్యత పాలకులకు ఉండాలి. అలా కాకుండా నా ఇష్టానుసారం పరిపాలన చేస్తానంటే ప్రజలు ఊరుకోరు. తిరగబడతారు. అన్ని మత సాంప్రదాయాలను సమానంగా కాపాడాల్సిన ముఖ్యమంత్రి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. హిందూ దేవాలయాలపై 80 దాడులు జరిగితే ఈ ముఖ్యమంత్రికి ఇంకా పరిపాలించే అర్హత ఉందా?“ అంటూ విరుచుకుప‌డ్డారు.

అప్ప‌ట్లో… మా పాల‌న‌లో….
తెలుగుదేశం హయాంలో మత సామరస్యాన్ని కాపాడామ‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాలను సమానంగా చూశామ‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. తాడేపల్లిగూడెంలో ఒక చర్చిపై దాడి జరిగితే దానిపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకున్నామ‌న్నారు. 426 జీవోకు వ్యతిరేకంగా దేవాలయాలలో దుకాణాలను అన్యమతస్తులకు ఇస్తున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. వాటికన్ సిటీ, జెరూసలేంలలో అన్యమత ప్రచారం చేస్తే ఆ మత భక్తుల విశ్వాసాలు దెబ్బతినవా? అలానే హిందూ మత దేవాలయాలలో అన్యమత ప్రచారం చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతినవా? అంటూ చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ప్రజల్లో చైతన్యం రావాలి. దేవాలయాలను చర్చీలను మనం కాపాడుకోలేకపోతే మనల్ని మనమే కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది. వైసీపీ అరాచకాలపై ప్రజలంతా తిరుగుబాటు చేయాలి. అంటూ చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju