NewsOrbit
న్యూస్

ఆ రకంగా తనకు తెలియకుండానే రోజాకు బంగారంలాంటి మంచి చేసిన జగన్ !

నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి రాకపోవటం కూడా మంచే చేసిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.తగిన సమయం దొరకడంతో రోజా నగరి నియోజక వర్గాన్ని పూర్తిగా తన గుప్పిట పెట్టుకునే ప్రయత్నాలలో మునిగి తేలుతున్నారు.

ys jagan favours to roja
ys jagan favours to roja

అసలు నియోజకవర్గంలో 2024 ఎన్నికల నాటికి తనకు పోటీయే లేకుండా కూడా చేసుకునే ఎత్తుగడలను రోజా అమలు చేస్తున్నారట.టిడిపి ఇక నగరిలో కోలుకోలేని రీతిలో రోజా దెబ్బ కొడుతున్నారట.ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో రెండుసార్లు వరస విజయాలను నమోదు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గాలి ముద్దు కృష్ణమనాయుడిపై నెగ్గిన ఆర్కే రోజా, 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గాలి తనయుడు భాను ప్రకాష్ పై విజయం సాధించారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణంతో నగరి నియోజకవర్గంలో టీడీపీకి నేత అంటూ లేకుండా పోయారు. క్యాడర్ ను పట్టించుకునే వారు లేరు.

పైగా గాలి ముద్దు కృష్ణంనాయుడు కుటుంబం లో అంతర్గత విభేదాలు ఉన్నాయి.ఈనేపధ్యంలో ఆ కుటుంబం నగరిలో రాజకీయాలు చేసే పరిస్థితుల్లో లేదు దీనిని ఆర్కే రోజా అడ్వాంటేజీగా మార్చుకుంటున్నారు. దీంతో ఆర్కే రోజా టీడీపీ క్యాడర్ కు కండువాలు కప్పే పనిలో పడ్డారు. ఇటీవలే 41 టీడీపీ సానుభూతిపరులైన కుటుంబాలకు ఆర్కే రోజా పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు, లోకేష్ పట్టించుకోకుంటే నగరిలో టీడీపీ దుకాణం బంద్ అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరిలో సగం టీడీపీ క్యాడర్ పార్టీని వీడి వెళ్లిందంటున్నారు.ఏదేమైనా నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కు రోజురోజుకూ గ్రిప్ పెంచుకుంటూ ఉంది. టీడీపీ క్యాడర్ ను పూర్తిగా తమ వైపునకు తిప్పుకునే పనిలో పడ్డారు ఆర్కేరోజా. ఆర్కే రోజాకు ఒకరకంగా మంత్రి పదవి రాకపోవడమే మంచిదయిందంటున్నారు ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు.

మంత్రి పదవి వచ్చి ఉంటే నియోజకవర్గం గురించి పట్టించుకునే సమయం ఉండేది కాదని, ఇప్పుడు పూర్తిగా నగరి మీదనే దృష్టి పెడుతుండటంతో టిడిపిని దెబ్బకొట్టే అవకాశం చిక్కినట్లయిందంటున్నారు.అంతా మన మంచికే అని పెద్దలు ఊరికే అన్నారా? జగనన్న తన ప్రియమైన చెల్లికి ఈవిధంగా కూడా మేలు చేశారన్నమాట.అయినా కాలం కలిసి వస్తున్నప్పుడు ఇలాగే అన్ని అనుకూలంగా మారుతుంటాయి!ఏదేమైనా రోజా అదృష్టవంతురాలే

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju