NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఎస్ పి బాలు ప్రస్థానం ఇది..!తొలి నుండి తుది వరకు..!!

 

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం (ఎస్ పి బాలు) ప్రముఖ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలో రాణించిన కలికితురాయి . బాలు ప్రస్థానం విషయానికి వస్తే…

1946 జూన్ నాల్గవ తేదీన నెల్లుూరు జిల్లా కొనేటమ్మపేట గ్రామంలో జన్మించిన బాలుకి చిన్న తనం నుండి పాటలు పాటడం చాలా ఇష్టంగా ఉండేది. తండ్రి కోరిక మేరకు మద్రాస్ వెళ్లి ఇంజనీరింగ్ (ఏఎంఐఇ)లో చేరారు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినీ రంగంలో పాటలు పాడేందుకు అవకాశం లభించింది. 1966లో నుటడు, నిర్మాత పద్మనాభం రూపొందించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రాామన్న చిత్రంలో పాటలు పాడే అవకాశం లభించింది. అప్పటి నుండి సినీ రంగంలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అమరగాయకుుడు ఘంటశాల వారసుడుగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. శంకరాభరణం, సాగర సంగమం వంటి మేటి తెలుగు చిత్రాలే కాకుండాా ఏక్ దుబే కేలియే లాంటి హిందీ చిత్రాల్లోనూ ఆయన పాడిన పాటలు దేశ వ్యాప్తంగా సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి. గాయకుడిగా తనను పరిచయం చేసిన సినీ సంగీత దర్శకుడు కోదండపాణి పై ఉన్న గౌరవం, అభిమానంతో బాలు నిర్మించిన ఆడియో ల్యాబ్ కు ఆయన పేరు పెట్టారు.

బాలు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 11 భాషలకు చెందిన 40వేలకు పైగా పాటలు పాడటంతో పాటు 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డు సాధించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా బాలు పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు దక్కాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలువురు ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, విష్ణు వర్థన్, రఘువరన్, నగేష్, అర్జున్ తదితర ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు బాలు. సినిమాల్లోనే కాక పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి టీవీి కార్యక్రమాలను నిర్వహించి ఏంతో మంది నూతన గాయనీ, గాయకులను పరిచయం చేశారు. స్వరాభిషేకం వంటి కార్యక్రమాల్లో తన గానమాధుర్యంతో సంగీతాభిమానులను రంజింపజేశారు.

భారత ప్రభుత్వం బాలుకు 2001లో పద్మశ్రీ,. 2011లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఏపి ప్రభుత్వం నుండి వివిధ విభాగాల్లో 25పర్యాయాలు పురస్కారాలు అందుకున్నారు 2012లో బాలు నటించిన మిధునం సినిమాకు నంది ప్రత్యేక బహుమతి అందుకున్నారు. బాలు తన సినీ ప్రస్థానంలో ఆరు జాతీయ పురస్కారాలు, ఆరు ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju