తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ యాంకర్ గా రాణిస్తున్న ప్రదీప్ పెళ్లి గురించి వార్తలు సోషల్ మరియు వెబ్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. యాంకర్ గా ప్రదీప్ చేస్తున్న చాలా షోలలో పెళ్లిళ్ల పై నిత్యం ఏదో రీతిలో సెటైర్లు వేస్తూ ఉండటం తెలిసిందే. అటువంటి ప్రదీప్ పెళ్లి గురించి తాజాగా వస్తున్న వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నయి. ఇటీవల ప్రదీప్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధాన్ని చేసుకుంటున్నట్లు క్లారిటీ ఇవ్వటం జరిగింది.
అయితే ఇటీవల లాక్డౌన్ సమయంలో ప్రదీప్ కి ఇంట్లో వారు ఓ మ్యాచ్ ఫిక్స్ చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందో ఇంతవరకు స్పష్టత రాలేదు. వైరల్ అవుతున్న వార్తలు చూస్తే ప్రదీప్ చేసుకునే అమ్మాయి మంచి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ కలిగిన అమ్మాయి అని…వాళ్ళ నాన్నగారు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కీలక నాయకుడుగా రాణిస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు జోరుగా ఊపందుకున్నాయి.
మరోపక్క వస్తున్న వార్తల విషయంలో యాంకర్ ప్రదీప్ ఇంతవరకు స్పందించలేదు. మరి వస్తున్న వార్తలు వాస్తవమో కాదో ఇంకా ఎవరూ నిర్ధారించుకోలేకపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ప్రదీప్ వయసు కలిగిన హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటువంటి తరుణంలో మొట్టమొదటిసారి ప్రదీప్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇస్తున్న “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా రిలీజ్ అవ్వక ముందే ప్రదీప్ పెళ్లి వార్త రావడం ఇండస్ట్రీలో కూడా ఈ వార్త సస్పెన్స్ గా మారింది.