NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పార్టీల పొత్తు పొడుపులు

చెన్నై, ఫిబ్రవరి 20: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమిళనాడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అన్నా డిఎంకె, పిఎంకె పార్టీలతో బిజెపి పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు చేసుకోగా, ఆ మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో సీట్ల సర్దు బాటు చర్యలకు ఉపక్రమించింది.

డిఎంకె నేత స్టాలిన్ పార్టీ 20నుండి 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుంది. మిగిలిన స్థానాలను భాగస్వామ్య పార్టీలకు ఇచ్చేందుకు సమ్మతిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కెసి వేణుగోపాల్, టిఎన్ ముకుల్ వాస్నిక్‌లు డిఎంకె నేత స్టాలిన్‌తో చర్చించేందుకు నేడు చెన్నైవస్తున్నారు.

డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమోళి ఇప్పటికే రెండు పర్యాయాలు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది లోక్‌సభ స్థానాలు కేటాయించేందుకు డిఎంకె సానుకూలత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. కనిమోళితో భేటీ అయిన అనంతరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు పి చిదంబరం, ఇవికెఎస్ ఇలంగోవన్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కెఎస్ అళగిరి, మాజీ అధ్యక్షుడు తిరునవుక్కరుసు, రామస్వామిలతో చర్చించారు.

బుధవారం కాంగ్రెస్ నేతలు వేణుగోపాల్, వాస్నిక్‌లు డిల్లీ నుండి చెన్నై చేరుకుని డిఎంకె నేతలతో చర్చించి సాయంత్రం నాలుగు గంటలకు సీట్ల ఒప్పందంపై అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.

ఇప్పటికే బిజెపి సీట్ల సర్దుబాటుపై ప్రకటన కూడా చేసింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉన్న తమిళనాడులో బిజెపి ఐదు, పిఎంకె ఏడు స్థానాలు కేటాయించి మిగిలిన స్థానాల్లో ఎఐడిఎంకె పోటీ చేయడానికి నిర్ణయానికి వచ్చి ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మంగళవారం ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి, డిప్యూటి సిఎం ఒ పన్నీర్‌సెల్వం, పిఎంకె నేత ఎస్ రాందాస్‌లతో చర్చించి పొత్తులను ఖరారు చేసుకున్నారు.

 

 

 

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

Leave a Comment