NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

అమెరికాలో ఎన్నికా..! మధ్యలో కరోనా కాక..!!

అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేళ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వైరస్ కరోనా బారిన పడటం తీవ్ర కలకలాన్ని రేపుతున్నది. డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి, భవిష్యత్తు రాజకీయ పరిమాణాలు తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి.

అమెరికాలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచార పర్వం పీక్ ధశలో ఉన్నది. ఈ తరుణంలో 74 ఏళ్ల డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటంతో ఎన్నికల ప్రచారం ఎట్లా, పరిపాలన సంగతి ఏమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వృద్ధులకు కరోనా సోకితే ప్రమాదకరమేననీ ప్రపంచ వ్యాప్తంగా అనేక సర్వేలు చెబుతున్నా కరోనాను జయంచిన వయో వృధ్దులూ ఉన్నారు. ఒక వేళ ట్రంప్ హాస్పటలైజేషన్ అయితే పాలనా పరిస్థితి ఏమిటి అన్న దానిపై చర్చ జరుగుతోంది. దానికి కారణం ఏమిటంటే 1967 ముందు వరకూ అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు పాలింటే పరిస్థితిలో లేకపోతే ఉపాధ్యక్షుడుగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తారు. 1963లో అధ్యక్షుడు జాన్ కెనడీ హత్యకు గురైన తరువాత 1967లో రాజ్యాంగానికి 25వ సవరణ చేశారు. దాని ప్రకారం అధ్యక్షుడు పాలనా బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితిలో ఉంటే తానే స్వయంగా తన బాధ్యతలను తాత్కాలికంగా బదలాయిస్తారు. ఒక వేళ బాధ్యతలను బదలాయించే స్థితిలో కూడా అధ్యక్షుడు లేకపోతే ఉపాధ్యక్షుడు లేదా కేబినెట్ కాంగ్రెస్ ఉభయ సభలకు తెలియజేసి తాత్కాలిక ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
గతంలో రోనాల్డ్ రీగన్, జార్జి హెచ్ డబ్ల్యు బుష్ లు స్వల్ప శస్త్ర చికిత్సలు చేయించుకున్న సమయంలో ఉపాధ్యక్షులకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.

ట్రంప్ కరోనా బారిన పడటంతో ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా ఈ నెల 15న ట్రంప్ ప్రత్యర్థి బైడెన్ తో జరగాల్సిన చర్చా కార్యక్రమంపై సందిగ్దత ఏర్పడింది. కరోనా గురించి భయపడాల్సిన పనేలేదంటూ తొలి నుండి లైట్ గా తీసుకున్నారు ట్రంప్. మాస్క్ కూడా తాను ధరించనంటూ గొప్పలు చెప్పుకున్న ట్రంప్ నేడు కరోనా సోకి ఐసోలేషన్ కు వెళ్లడం గమనార్హం. అక్కడి రాజకీయ పరిణామాలు, పాలనా వ్యవహారాలు ఏలా ఉంటాయో వేచి చూడాలి.

Related posts

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju