NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌వ‌హ‌ర్ స‌త్తా తెలిసిపోయిందిగా…!

మాజీ మంత్రి కేఎస్‌. జ‌వ‌హ‌ర్‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌మండ్రి పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్షుడిగా నియ‌మించారు. నిజానికి ఈ విష‌యంలో చాలా అసంతృప్తి ఉంది. నేత‌లు ఆయ‌న‌పై తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. ఎంతో మంది సీనియ‌ర్లు, పార్టీ కోసం ఏళ్ల‌త‌ర‌బ‌డి ప‌నిచేసిన వారిని ప‌క్క‌న పెట్టి.. జ‌వ‌హ‌ర్‌కు ఇంత‌టి కీల‌క అవ‌కాశం ఎందుకు ఇచ్చార‌ని.. రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి ఇప్ప‌టికే ఆఫ్‌ది రికార్డుగా అధిష్టానానికి ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ బాట‌లోనే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు జ‌వ‌హ‌ర్ నియామ‌కంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

కరోనా ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటున్నారు: జగన్‌పై జవహర్ సెటైర్లు | ex minister ks jawahar comments on ap cm ys jaganmohan reddy over coronavirusస‌రే..! ఇప్పుడు ఆయ‌న‌ను ఎలాగూ నియ‌మించేశారు. చేసేది ఏమీ లేదు. ఆయ‌న చెప్పింది విన‌డం, చేయ‌మంది చేయ‌డమే ఇప్పుడు నేత‌ల ముందున్న మార్గం. మ‌రి జ‌వ‌హ‌ర్ మాట వింటారా? ఆయ‌న సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటిస్తారా? గ‌త ఎన్నిక‌ల అనంత‌రం తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన నేత‌ల‌ను జ‌వ‌హ‌ర్ లైన్‌లోకి తెస్తారా? పార్టీ పుంజుకునేలా వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్తారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ నేత‌ల్లో వినిపిస్తున్నాయి.

తాజాగా జ‌వ‌హ‌ర్ ఇక్క‌డ స‌మావేశం ఏర్పాటు చేశారు. దీనిపైరెండు రోజులు క‌స‌ర‌త్తు చేశారు. ఎవ‌రికి ఆహ్వానాలు పంపాలో వారంద‌రికీ ఆహ్వానాలు పంపారు. అజెండా సిద్ధం చేసుకున్నారు. రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇల్లే వేదిక‌గా ఈ స‌మావేశం నిర్వ‌హించారు. మ‌రి జ‌వ‌హ‌ర్ ఇచ్చిన పిలుపుతో ఎంత‌మంది నాయ‌కులు ఈ స‌మావేశానికి వ‌చ్చారు? ఎవ‌రెవ‌రు ఆయ‌న‌తో క‌లిసి ఈ స‌మావేశంలో పాల్గొన్నారు? అంటే.. వేళ్ల మీద లెక్కించుకునే రేంజ్‌లోనేసాగింది. దాదాపు అర‌గంట‌కు పైగా నాయ‌కుల రాక‌కోసం.. జ‌వ‌హ‌ర్ ఎదురు చూశారు.

అయిన‌ప్ప‌టికీ కీల‌కమైన నాయ‌కులు ఎవ‌రూ రాలేదు. దీంతో కంటితుడుపుగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీంతో జ‌వ‌హ‌ర్ స‌త్తా ఏంటో తెలిసిపోయింద‌నే వ్యాఖ్య‌లు తూర్పులో బాగానే వినిపిస్తున్నాయి. ఫ‌స్ట్ మీటింగ్‌కే ఎవ‌రూ రాక‌పోతే.. మున్ముందు ఆయ‌న మాట‌ల‌ను ఎంత మంది ప‌ట్టించుకుంటారు? ఎంత మంది ఆయ‌న బాట‌లో న‌డుస్తారో..? అర్ధం కావ‌డం లేదా? అని సీనియ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. సో.. మొత్తానికి ఇప్పుడు జ‌వ‌హ‌ర్ స‌త్తా తెలిసింది. అయితే, ఇదే విధంగా ముందు రోజులు ఉండాల‌ని లేదు కానీ.. ప్ర‌స్తుతం అయితే.. జ‌వ‌హ‌ర్ ముందు నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేవ్యూహం ఉండాల‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో ? చూడాలి.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju