NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

న్యాయవ్యవస్థ వ్యూహాత్మక మౌనమా..? జగన్ తొలి విజయమా..? లోతైన విశ్లేషణ..!!

Justice NV Ramana: in Confusion about his First Case?

ఏపీలో మొదలైన ప్రభుత్వం X న్యాయవ్యవస్థ మధ్య గొడవ సుప్రీమ్ న్యాయమూర్తి వరకు వెళ్ళింది..! రెండు రోజుల కిందట ప్రభుత్వ సలహాదారు అజయ్ కళ్ళం మీడియా ముఖంగా కీలక విషయాలను వెల్లడించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు సహా సుప్రీమ్ న్యాయమూర్తిపై తీవ్ర ఆరోపణలతో సీఎం జగన్ రాసిన లేఖని కూడా విడుదల చేసారు..! మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్ళింది..? న్యాయవ్యవస్థ మౌనం వెనుక కారణం ఏంటి..? జగన్ తొలి విజయంగా ఎందుకు చెప్పుకోవచ్చు..! అనేది “న్యూస్ ఆర్బిట్” సునిశిత విశ్లేషణ..!!

అటు మౌనం..! కానీ అంతర్గతం..!

ఈ వివాదం జరిగిన మరుక్షణమే.. అంటే గడిచిన రెండు రోజుల్లో టీడీపీ అనుకూల మీడియా, వారి సోషల్ మీడియాలో జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. “జగన్ రహస్య సమాచారం బయటకు చేరవేశారని., తీవ్ర ఇబ్బందుల్లో పడినట్టేనని.., అందుకే ఇటు హైకోర్టు, సుప్రీమ్ కోర్టు.., కేంద్రం కూడా జగన్ పని పడతారని” ప్రచారం చేశారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా “ఏపీ హైకోర్టు న్యాయకోవిదుల్లో అంతర్మధనం మొదలైనట్టు.. ఈ పరిస్థితి, ఎవరికీ మంచిది కాదు.., ముఖ్యంగా రాష్ట్రానికి మంచిది కాదని భావించి.., చక్కబెట్టేందుకు అంతర్గత చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా..! ఇది రాష్ట్ర ప్రజానీకం పరంగా ఒకింత శుభ పరిణామమే కాక.., సీఎం జగన్ తొలి విజయంగా భావించవచ్చు.

ఈ విజయం.. కానీ ఇంకా కీలకమైన అడుగు ఉంది..!

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీ ముఖ్య నేతలకు “న్యాయస్థానాలకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని.., సుప్రీమ్ కి రాసిన లేఖపై ఏమి మాట్లాడవద్దు అంటూ సందేశం పంపించారు. ఇక్కడే మనం గ్రహించాల్సిన అంశాలు ఉన్నాయి. న్యాయవ్యవస్థలో అంతర్గత చర్చలు జరిపి, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించారు..!, మరోవైపు వైసీపీ ప్రభుత్వ పరంగా ఎటువంటి వ్యాఖ్యలు వద్దు” అంటూ సందేశాన్నిచ్చారు. ఇలా
ఇరువర్గాల్లో వచ్చిన ఈ మార్పు శుభ పరిణామంగానే భావించవచ్చు. కానీ ఇది తాత్కాలికమా..? శాశ్వతమా అనేది కాలం తేల్చాల్సి ఉంది. ముఖ్యంగా జగన్ రెండు అంశాల్లో సుప్రీమ్ కోర్టు సీజేకి లేఖ రాశారు.


* ఒకటో అంశంలో సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ, రెండో అంశమే ఇప్పుడు కీలకం. జస్టిస్ రమణ.. చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందుతున్నారు, అందుకే జగన్ ఆరోపణలు అనే అంశంపై వివాదం అలాగే కొనసాగుతుంది. దీని పర్యవసానం ఎలా ఉంటుంది.., ఇంకా జస్టిస్ రమణ చీఫ్ జస్టిస్ పదవి అధిరోహిస్తారా లేదా అనే స్పష్టత రావాలంటే మూడు నెలల సమయం పట్టె వీలుంది. అందుకే ఈ రెండో అంశంలో ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ.., రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల భవిష్యత్తుకి ముడి పడి ఉంది కాబట్టి.., మొదటి అంశంలో ఇరువర్గాలు సైలెంట్ అవ్వడం శుభ పరిణామమే… ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్.., తాజా అంశాలు “న్యూస్ ఆర్బిట్” ఉన్నది ఉన్నట్టు విశ్లేషిస్తుంది.

 

 

 

 

 

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N