NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బరువు తగ్గాలని భూమిని చుట్టిన 70 ఏళ్ల వృద్ధుడు!

70 సంవత్సరాల వృద్ధుడు భూమిని చుట్టేశాడు.. అదేంటి అని అనుకుంటున్నారా?1,500 రోజుల్లో భూమికి సమానమైన40,075 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను ఎందుకు ఎన్ని కిలోమీటర్లు నడిచారో తెలుసా? తన బరువును తగ్గించుకోవడం కోసం ఏకంగా భూమిని చుట్టి వచ్చాడని గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు నిర్వాహకులు తెలిపారు. ఎవరైనా బరువు తగ్గడం కోసం డైట్ ఫాలో అవుతారు, శరీరానికి తగ్గట్టు వ్యాయామం చేస్తూ ఉంటారు. మరికొందరు ఏదైనా ట్రీట్మెంట్ ను తీసుకుంటారు. కానీ తన ఏకంగా భూమిని చుట్టేసి రావడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.

పంజాబ్ లో జన్మించిన వినోద్ బజాజ్ అనే వ్యక్తి గడిచిన నలభై సంవత్సరాలుగా ఐర్లాండ్ లో నివసిస్తున్నాడు. తన బరువును తగ్గించుకోవడం కోసం వినూత్నమైన ఆలోచన చేశాడు. 2016వ సంవత్సరంలో తన బరువును తగ్గించుకోవడం కోసం ఏకంగా భూమి చుట్టూ తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ యాత్రను ప్రారంభించి బరువు తగ్గుతుండటంతో, అతనిలో నడవాలని ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది. ఈ విషయం గురించి వినోద్ బజాజ్ మాట్లాడుతూ, తాను ఆహారంలో ఎటువంటి మార్పులు చేయకుండా, కేవలం నడక ద్వారా మాత్రమే తన బరువు తగ్గాను అని తెలిపారు. నడక ప్రారంభించిన మొదటి మూడు నెలలలో ఏకంగా ఎనిమిది కిలోల బరువు తగ్గానని తెలిపారు.

ఒక సంవత్సరం పూర్తి అయ్యేలోపు దాదాపుగా 7 వేల 600 కిలోమీటర్ల నడకను పూర్తి చేశారు. దీంతో అతనిలో నడవాలనే ఉత్సాహం పెరిగిందని తెలిపారు. రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి 1,500 కిలోమీటర్ల నడక పూర్తి చేశానని ఈ విధంగా మొత్తం 1500 రోజుల్లో దాదాపుగా 40,075 కిలోమీటర్లు నడిచానని తెలిపారు. వినోద్ బజాజ్ రిటైర్డ్ ఇంజనీర్, బిజినెస్ కన్సల్టెంట్ పనిచేశారు.1975 వ సంవత్సరంలో చదువు నిమిత్తం స్కాట్లాండ్ లోని గ్లాస్గోకు వెళ్లారు.అయితే గత నలభై మూడు సంవత్సరాల నుంచి ఐర్లాండ్ లో స్థిరపడి అక్కడే నివాసం ఉంటున్న, వినోద్ బజాజ్ 2016లో తన నడకను ప్రారంభించి గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నాడు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju