NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

జగన్ వద్దన్నారా..? ఈయన వెళ్లలేదా..? ఆ ఎమ్మెల్యే విషయంలో ఏమైంది..!?

రంగులు మార్చడం నాయకులకు పెద్ద కష్టమేమీ కాదు..! ఇటు వాళ్లకి వెళ్లిపోవాలని ఉన్నా.., అటు నుండి ఆహ్వానం వచ్చినా మారిపోతారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది విచ్చలవిడిగా జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాకా జరుగుతుంది. ఫిరాయింపులు అని పిలవలేని విధంగా జగన్ చేర్చుకుంటున్నారు..!

ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు అంటే..! టీడీపీ నుండి గెలిచి, ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కి జై కొట్టారు. వాళ్ళందరూ ఒక ఎత్తు.., ఒక్క ఎమ్మెల్యే మాత్రం మరో ఎత్తు..! ఈయన చేరడానికి సీఎం ఒప్పుకోవడం లేదా.., ఈయనే చేరడం లేదా అనేది కింద చెప్పుకుందాం కానీ..! ఈయన ప్రత్యేకత మాత్రం ముందు తెలుసుకోవాల్సిందే..!!

ఆ 23 లో ఒక్కడు.., ఈ 23 లో ముందుగా..!!

రాజకీయాలను వ్యాపారంగా.., వ్యాపారాన్ని రాజకీయంగా.., మొత్తానికి రాజకీయాలను, వ్యాపారాన్ని రెండింటిని గెలిచిన నేత అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. గడిచిన రెండు దశాబ్దాల్లో సాఫీగా సాగిపోయిన తన రాజకీయ కెరీర్ లో తొలిసారి అటు రాజకీయ, ఇటు వ్యాపారపరంగా చిక్కుల్లో ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది పార్టీ మారిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఆ 23 మందిలో ఈ ఒక్కరే టీడీపీ నుండి పోటీ చేసి 2019 ఎన్నికల్లో గెలిచారు. వైసీపీ గాలిలో కూడా 12,990 మెజారిటీ తెచ్చుకున్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక.., టీడీపీ నుండి గెలిచిన 23 మందిలో అందరి కంటే ముందుగా గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారిపోతారని విపరీత ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ఇది జరగలేదు..!? ఎందుకు..? ఎమ్మెల్యే వెళ్లడం లేదా..!? లేదా జగన్ రానీయడం లేదా..!? అనేది ఎవరికీ అంతుపట్టని కీలకమైన విషయం. ఈ అంశంపై “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక సోర్సులు, స్థానిక పరిస్థితుల దృష్ట్యా రాస్తున్న కీలక కథనం ఇది.

రెండు విధాలుగా కొన్ని లాజిక్స్ ఆలోచిస్తే..!

సాధారణంగా ఎమ్మెల్యే పార్టీ మారాలి అంటే.. ఈయన వెళ్లి పెద్దల్ని కలిసి తన అభిప్రాయాన్ని చెప్పాలి. లేదా పార్టీ పెద్దలే సంప్రదించి, ఆహ్వానించాలి..! ఇక్కడ గొట్టిపాటి విషయంలో ఎక్కడ, ఎందుకు ఆగిందో తెలుసుకుందాం.

* నాడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ 23 మందీ పార్టీ మారడం వేరు. గొట్టిపాటి మారడం వేరు. ఈయన జగన్ కి అత్యంత సన్నిహితుడు. జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్, రవికుమార్ తండ్రి శేషగిరి కలిసి గుల్బర్గాలో కలిసి చదువుకున్నారు. అలా వైయస్ కుటుంబానికి రవి సన్నిహితుడిగా మారారు. అటు గ్రానైట్.., సినీ వ్యాపారాలు చేస్తూనే.., ఇటు రాజకీయాల్లో ఎదిగారు. 2004 నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2015 లో టీడీపీ ఒత్తిళ్లు తట్టుకోలేక.., చంద్రబాబుకి జై కొట్టారు. ఇది జగన్ కి ఏమాత్రం నచ్చలేదు. ఎమ్మెల్యేలు పార్టీ మారడం జగన్ ఎంతగా వ్యతిరేకించారో అందరికీ తెలిసిందే. కానీ గొట్టిపాటి విషయంలో మాత్రం జగన్ చాలా హర్ట్ అయ్యారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చాక “నాడు బాబు గ్రానైట్ వ్యాపారంలో లొసుగులుని చూపి రవిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు జగన్ కూడా అదే గ్రానైట్ బూచిని చూపి రవిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ఓ వాదన. ఈ క్రమంలోనే రవికుమార్ వైసీపీలో చేరిపోవాలన్నా రానీయడం లేదట. ఆ ఒక్కడు తప్ప ఎవరైనా ఒకే అని జగన్ గట్టిగా ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి..!!

* మరోవైపు రవికుమార్ సైడ్ వాదన వేరేలా ఉంది. అయిదేళ్ల కిందట పార్టీ మారి.., చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా మారారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి.. ఇప్పుడు పార్టీలోనూ మంచి స్థాయికి ఎదిగి, పార్టీలో చాలా కంఫర్ట్ గా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తారు అన్నంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ఈ సమయంలో పార్టీ మారితే తన వ్యక్తిత్వంపై ముద్ర పడుతుందని.., అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. వ్యాపారపరంగా ఇబ్బందులున్నా, ఆర్ధికంగా నష్టపోయినా టీడీపీ వీడేది లేదంటూ ఈయన వర్గం చెప్తుంది.

ఇప్పుడు కొన్ని వాస్తవాలు చెప్పుకుందాం..!!

ఇంతకూ జగన్ రానీయడం లేదా..? రవికుమార్ వెళ్లడం లేదా..? అనేది ఎవరి వాదన వారి అనుకూలంగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో కొన్ని వాస్తవాలను మాత్రం పరిశీలించి, ఒక అవగాహనకు రావచ్చు. రవికుమార్ ప్రభుత్వంలో చేరకపోయినా., కనీసం జగన్ తో సానుకూలంగా ఉండేందుకు మాత్రం రాయబారాలు నడిపారు అనేది ఓ వాస్తవం. కానీ ఇద్దరి మధ్య అవగాహన కుదరలేదు. అందుకే ప్రకాశం జిల్లాలో 26 గ్రానైట్ క్వారీలకు రూ. కోట్లలో ఫైన్లు వేశారు. వారిలో చాలా మంది అధికార పార్టీలోకి చేరిపోయారు. రవికుమార్ క్వారీలకు రూ. 285 కోట్లు ఫైన్ వేశారు. ఈయన మాత్రం చేరలేదు. చివరికి క్వారీ లీజులు కూడా ప్రభుత్వం రద్దు చేసింది. రవికుమార్ కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అంటే ఈ ఎమ్మెల్యే విషయంలో జగన్ ఎంత సీరియస్ గా ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు రవికుమార్ కూడా గతం కంటే టీడీపీలో ఇప్పుడు చురుకయ్యారు. “జగన్ పై అసంతృప్తి పెరుగుతుంది. కేవలం సెంటిమెంట్ తో గెలిచారు. ఆయనకు భవిష్యత్తు లేదు” అంటూ అంతర్గతంగా చెప్పుకొస్తున్నారు. అంటే అటు జగన్.. రవి విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో.., ఇటు రవికుమార్ కూడా ఇప్పుడిప్పుడే జగన్ పట్ల వ్యతిరేక ధోరణికి వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ… ఒక్కటి మాత్రం నిజం. ఏ సమయంలో అయినా ఇద్దరి మధ్య పాత స్నేహం చిగురిస్తే.., జంపింగ్ ని ఎవరూ ఆపలేరు..!!

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N