NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పండుగ సీజన్‌లో ఆఫ‌ర్ల‌తో అద‌ర‌గొడుతున్న ఎస్‌బీఐ !

ఇప్ప‌టికే పండ‌గ సీజ‌న్ మొద‌లైంది. దీంతో ద‌స‌రా, దీపావ‌ళీ ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకోని భారీగా బిజినెస్ చేయ‌డానికి అనేక సంస్థ‌లు ఇప్ప‌టికే సిద్ద‌మయ్యాయి. ఈ నేథ్యంలోనే ఇప్ప‌టికే ఖాతాదారుల కోసం ప‌లు బ్యాంకులు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించాయి. తాజాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న ఖాతాదారులకు అదిరిపోయే ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది.

ఈ పండ‌గ సీజ‌న్‌లో ప్ర‌జ‌లు వ‌స్తువుల కోనుగోలు చేయ‌డంపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. దీనిని దీనిని గుర్తించిన ఎస్‌బీఐ త‌న ఖాతాదారులు తీసుకునే లోన్ల‌పై వ‌డ్డీని భారీగా త‌గ్గించింది. గోల్డ్ లోన్‌, ప‌ర్స‌న‌ల్ లోన్‌, కార్ లోన్ వంటి రుణాల‌ను త‌క్కువ వ‌డ్డీకే అందిస్తోంది. దీనికి తోడు, పొందే రుణాల‌న్నింటిపై ప్రాసెసింగ్ ఫీజును సైతం త‌గ్గించింది. దీని కోసం మీరు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా లోన్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంద‌ని బ్యాంకు అధికారులు వెల్ల‌డించారు.

ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటే వ‌డ్డీ రేటు 9.6 శాతం నుంచి మొద‌ల‌వుతుంది. అదే కార్‌లోన్ అయితే వ‌డ్డీ రేటు 7.5 శాతంగా నుంచి ప‌డుతుంది. ఇక గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తే వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమ‌వుతుంది. వ‌డ్డీ రేటు పెర‌గ‌కుండా ఉండాలంటే తీసుకున్న లోన్‌ల‌ను తిరిగి 36 నెల‌ల లోపు చెల్లించాల్సి ఉంటుంద‌ని ఎస్‌బీఐ ట్విట్ట‌ర్ ద్వారా తాజాగా వెల్ల‌డించింది. అయితే, ఈ ప‌ర్స‌న‌ల్ లోన్ మాత్రం ప‌రిమిత సంఖ్య‌లోనే అందిస్తున్న‌ది.

ఈ లోన్ పొంద‌డానికి మీకు అర్హ‌త ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా మీ మొబైల్ ఫోన్ నుంచి “పీఏపీల్” అని క్యాపిట‌ల్ లెట‌ర్స్ టైప్ చేసి త‌ర్వాత మీ అకౌంట్ చివ‌రి నాలుగు నెంబర్ల‌ను ఎంట‌ర్ చేసి, 567676 నెంబ‌ర్ ఎస్ఎంఎస్ చేయండి. సంబంధిత వివ‌రాలు మీకు బ్యాంకు నుంచి తిరిగి అందుతాయి.

అలాగే, ఎస్‌బీఐ డెబిట్ కార్డుల‌పై కోనుగోలుకు సంబంధించి ఇటీవ‌ల ప‌లు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అకౌంట్‌లో మ‌నీ లేక‌పోయిన కోనుగోలు చేయ‌డానికి క్రెడిట్ కార్డుల ఉప‌యోగ‌ప‌డేవి. అయితే, ఈ పండ‌గ సీజ‌న్‌లో డెబిట్ కార్డుల‌పై కూడా ఎస్‌బీఐ ఈ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఈఎంఐగా కూడా మార్చుకోవ‌చ్చు. రూ.8000 వేల నుంచి గ‌రిష్టంగా ఒక ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ ఈఎంఐ బెనిఫిట్స్ పొంద‌వ‌చ్చు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju