NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఛేదించారు.. సాధించారు ఏపీ పోలీసుల ఖ్యాతి!!

 

(అమరావతి “న్యూస్ ఆర్బిట్” స్పెషల్ బ్యూరో)

ఏపీ పోలీసులు స్కోచ్ అవార్డు ల పంట పండించారు. ఏకంగా 48 అవార్డులు దక్కించుకుని దేశంలోనే మరోసారి ఏపీ పోలీసుల సత్తాని చాటారు. ఈసారి మొత్తం 83 అవార్డులను ప్రకటిస్తే దాని లో ఏకంగా ఏపీ పోలీసులు 48 అవార్డులు గెలుచుకోవడం విశేషం. కేరళ 9 అవార్డు లను గెలుచుకుని రెండో స్థానంలో ఉంటే, మహారాష్ట్ర, పచ్ఛిమబంగా 4 గేసి అవార్డులు గెల్చుకున్నాయి. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ఒకే అవార్డుతో సరిపుచ్చుకుంది.

ఏమిటీ అవార్డ్??

స్కోచ్ సంస్థ 2003 నుంచి అవార్డుల ను అందిస్తోంది. వ్యక్తిగత విభాగంతో పాటు సంస్థల సేవలు గుర్తింపు విడివిడిగా అవార్డు ఇస్తోంది. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా సేవల అత్యున్నత పురస్కారం కింద గుర్తించింది. టెక్నాలజీ, ఫైనాన్షియల్ , సామాజిక అనే మూడు విభాగాల కింద సేవలను గుర్తిస్తూ ఈ అవార్డులను గోల్డ్ సిల్వర్ రూపంలో ఇస్తోంది. అంటే ప్రతి విభాగానికి గోల్డ్, సిల్వర్ విజేతలు ఉంటారు. గత ఏడేళ్లుగా ఈ అవార్డులకు పోటీపడుతున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతియేటా ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ అవార్డును అందుకున్నారు. ఈసారి ఏకంగా 55 శాతం అవార్డులను రాష్ట్ర పోలీసులే అందుకోవడం విశేషం. వ్యక్తిగత విభాగంలో 20 అవార్డులు, సంస్థ విభాగంలో 24 అవార్డులు, ఏపీ సీఐడీకు 4 అవార్డులు వెరసి 48 అవార్డులు దక్కించుకున్నారు.

సీఐడీ వరుసగా…!!

ఏపీ సి ఐ డి విభాగం స్కోచ్ అవార్డులను వరుసగా దక్కించుకుంటోంది. గత సంవత్సరం మూడు అవార్డులు ఏపీ సిఐడి సాధిస్తే ఈ ఏడాది 4 అవార్డును సాధించి ఓ మెట్టు ముందే ఉంది. ఈసారి సాంకేతికత, ఫైనాన్సు, సామాజిక రంగాల్లో మూడు విభాగాల్లోనూ సిఐడి సత్తా చాటింది. ఆర్థికపరమైన కేసుల విచారణ, వాటి దర్యాప్తులో వాడిన సాంకేతికత ఆధారంగా ఈసారి సి.ఐ.డి ప్రతిభ కనబరిచింది. గత సంవత్సరం కంటే ఆర్థిక మూలాలు ఉన్న కేసులను రెండు శాతం మేర నమోదు చేసి, వాటి దర్యాప్తులో ముందు ఉండటంతో పాటు మూడు ప్రత్యేక కేసుల్లో సిఐడి తన ప్రతిభను డాక్యుమెంటేషన్ రూపంలో స్కోచ్ జ్యూరీకి పంపి సత్తా చాటింది.

కోవిడ్ థీమ్ లో ముందు..!!

ఏటా ఒక థీమ్ పేరుతో అవార్డులను ప్రకటించే స్కోచ్ ఈ సారి అవార్డులకు కోవిడ్ కట్టడిలో వ్యవహరించిన తీరు థీమ్ గా తీసుకుంది. కోవిడ్ నివారణ చర్యల్లో పోలీసులు చూపిన చొరవ సామాజిక విభాగంలో అవార్డుల పంట పండించింది. దీంతోపాటు దిశ పోలీస్ స్టేషన్లు పోలీసు సేవ యాప్ సాంకేతిక విభాగంలో అదరగొట్టాయి. మొత్తంగా ఈ సారి స్కోచ్ అవార్డుల జాబితాలో అంత తెలుగు కళ ఉట్టిపడింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju