NewsOrbit
న్యూస్

ఏ ముఖ్యమంత్రి కీ లేని అరుదైన ప్రత్యేకత ఇది!నితీష్ కుమార్ కు మాత్రమే చెల్లింది!!

సాధారణంగా ముఖ్యమంత్రులు శాసనసభ్యులై ఉంటారు.అంటే ఎమ్మెల్యేల అన్నమాట.ఒక రాష్ట్రంలో అసెంబ్లీ,శాసనమండలి ఉన్నా కూడా ఎమ్మెల్యేలే సీఎంలవుతుంటారు.ఎమ్మెల్సీలకు అవకాశం తక్కువ.

అనివార్య పరిస్థితుల్లో ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తి సీఎం అయితే ఆయన ఆ పదవి చేపట్టిన ఆరు నెలల్లోపు చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది.ఈ పరిస్థితుల్లో ఎవరో ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి ఆ స్థానం నుండి సదరు సీఎం గెలిచి వస్తారు.సీఎంగా ఉన్న వ్యక్తి శాసనమండలిని ఎంపిక చేసుకోవడం బహు అరుదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భవనం వెంకట్రామ్ మాత్రమే శాసన మండలి సభ్యులుగా ఉండి సీఎం అయ్యారు.ఆరునెలలలోపే ఆయన సీఎం పదవి పోయింది. అయితే దేశంలోని ఒకే ఒక్కరాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగకుండా శాసనమండలి సభ్యుని(ఎమ్మెల్సీ) గానే కొనసాగుతూ ఆరుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.ఇప్పటికీ ముఖ్యమంత్రిగానే ఉన్న ఆయనే బీహార్ సీఎం నితీశ్ కుమార్!త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల లో కూడా నితీష్ పోటీ చేయకపోవడం ఇక్కడ విశేషం.

2005 నుంచి పదిహేను సంవత్సరాలుగా బీహార్‌ను పరిపాలిస్తున్న నితీష్ కుమార్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోటీ చేయకుండానే ఆరు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.నిజానికి నితీష్ 35 ఏళ్లుగా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2004 తర్వాత ఆయన ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.నితీష్ మొదటి సారి 1977 లో నలంద జిల్లాలోని హర్నాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.1985లో అదే స్థానంలో విజయం సాధించారు.ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల మొఖం చూడలేదు.1989 నుండి ఐదుసార్లు ఎంపీ అయ్యారు.తదుపరి బీహార్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి 2000 వ సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు అయితే శాసనసభలో మెజారిటీ లేకపోవటంతో ఎనిమిది రోజులకే ప్రభుత్వం కూలిపోయింది.2005 లో బీజేపీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించిన నితీష్ ఇక వెనుతిరిగి చూడలేదు.

ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయనే ముఖ్యమంత్రి..కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరు.ఎమ్మెల్సీగానే సీఎం కుర్చీపై కూర్చుని ఉంటారు.అదే బిహార్ సిఎం నితీష్ కుమార్ స్పెషాలిటీ.ఈ విషయాన్నే బీహార్ ఎన్నికల ప్రచారంలో మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఎత్తిచూపుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేని సీఎం అంటూ నితీష్ను ఎద్దేవా చేస్తున్నారు.ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ గురించి తనపై వచ్చే విమర్శలను నితీష్ సమర్ధవంతంగానే తిప్పి కొట్టారు. తాను ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితం కాదల్చుకోలేదని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కౌంటర్ ఇచ్చారు.ఏదేమైనా ఒక సీఎం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది మాత్రం ఆసక్తికరమైన అంశమే!

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju