మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలుసే కదా.. రీసెంట్ గా కూడా మెగా ఓ హీరో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఇప్పడు స్వయాన మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితా కొణిదెల కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే యాక్టింగ్ విభాగంలోకి మాత్రం కాదు. సుష్మితా కొణిదెల, తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి ఒక ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసింది. మొదటి ప్రయాత్నంగా షూట్ అవుట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.
ఈ షూట్ అవుట్ ఎట్ ఆలేర్ వెబ్ సీరిస్ లో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ఇప్పుడు విడుదలైంది. ఇందులో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ పోలీసు ఆఫీసర్ల పాత్రల్లో కనిపిస్తున్నారు. యాక్షన్ తరహా వెబ్ సిరీస్ గా పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ వెబ్ సిరీస్ జనాలను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
ఈ వెబ్ సిరీస్ ను నిర్మించిన చిరంజీవి కూతురు సుష్మిత.. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ తమ్ముడి కూతురు నిహారికతో విడుదల చేయించారు. ఈ సందర్భంగా సుష్మితకు మెగా కాంపౌండ్ యంగ్ యాక్టర్లంతా బెస్ట్ విషెస్ తెలిపారు. నిర్మాతగా సుష్మిత చాలా కష్టపడిందని పలువురు పేర్కొన్నారు. తను ఎన్నో విజయాలను సాధించాలని కోరుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..
ఆల్ ది బెస్ట్ హను అక్కా.. నీకు అంతా మంచే జరగాలి. విజయం సాధించాలని కోరుకుంటున్నానని సాయి తేజ్ అన్నాడు. ఈ వెబ్ సిరీస్ కోసం నువ్వు, నీ టీమ్ ఎంత కష్టపడ్డారో తెలుసు. ఆల్ ది వెరీ బెస్ట్. త్వరగా వెబ్ సిరీస్ చూడాలని ఉందని నిహారిక అంది. ఈ ప్రాజెక్ట్ మీద మీరు ఎంత కష్టపడి పని చేశారో నేను చూశా. ఇది సూపర్ హిట్ అవుతుంది. మీ టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అని కల్యాణ్ దేవ్ అన్నాడు. అయితే ఈ సిరీస్ తో మెగాస్టార్ కూతురు ఎంత విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు.