NewsOrbit
న్యూస్

విషాదానికి, వైరస్ కి మొదటి పుట్టిన రోజు..! మానవ మేధస్సు ఓటమి రోజు..!!

 

 

కరోనా పేరు విన్నారుగా …ఇది తెలియనివారు ఉండరు అనుకోండి…. ప్రపంచంలోని అన్ని దేశాలలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరు మాట్లాడుకునే హాట్ టాపిక్ కరోనా. దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో కూడా అందరికి తెలుసు. చైనా లో పురుడు పోసుకున్న కరోనా ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచ దేశాలు అన్నిటిని ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా ఎంతో కృంగతీసింది. దేశాలు అన్నీటిని గజగజలాడిస్తూ, మానవ మేధసుకి ఓటమిని గుర్తు చేసిన, కరోనా వైరస్ మొదటి కేసు వెలుగు చూసి నేటికి ఏడాది పూర్తయింది. కరోనా వైరస్ ఎలా పుట్టింది అన్నే విషయం మీద భిన్నా అభిప్రాయాలూ ఉన్నపటికీ, హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన దాని ప్రకారం 2019 నవంబర్‌ 17న మొదటి కేసు నమోదు అయింది. సంవత్సర కాలం లో ప్రపంచం మొత్తాన్ని ఈ వైరస్ అతలాకుతలం చేసేసింది. ఎన్నో కొత్త పుంతనాలు తొక్కుతూ, సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకుంటూ, ముందుకు వెళ్తున్న వైద్య రంగం,ఈ వైరస్ వ్యాప్తితో కుదేలు అయిపోయింది. సంవత్సర కాలంగా వైద్యులు, శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా కష్టపడుతున్న ఇప్పటికి ఈ కరోనా కి మందు ఇంకా ట్రైల్స్ దశ లోనే ఉంది.

నవంబర్ 17,2019 చైనా లోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మొట్ట మొదట కరోనా సోకినట్లు గుర్తించారు.వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో ప్రతిరోజూ ఒకటి నుండి ఐదు కొత్త కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఆ తరువాత డిసెంబరు 15 నాటికి  మొత్తం ఇన్ఫెక్షన్లు 27 కి చేరుకున్నాయని, డిసెంబర్‌20 నాటికి ఈ సంఖ్య 60 కు చేరింది అన్ని,ఎస్సీఎంపీ నివేదించింది. అయితే డిసెంబర్ 27 న ఇది కొత్త రకం కరోనా వైరస్ అన్నీ హుబెయ్ లోని ప్రావిన్షియల్ హాస్పిటల్‌లోని శ్వాసకోశ విభాగాధిపతి డాక్టర్ హ్యాంగ్ జిక్సన్, చైనాలోని ఆరోగ్య అధికారులు తెలిపారు. కరోనా సోకినా వారిలో ఇమ్మ్యూనిటి సిస్టం తగ్గిపోయి, శరీరంలో యాంటీ బాడీస్ ఎక్కువ అయ్యి, శ్వాస కొస సమస్యలతో ఊపిరి ఆడక మరణిస్తున్నారు అన్నీవాళ్ళు నివేదించారు. అప్పటివరకు చైనా లో మాత్రమే ఉన్న కరోనా వైరస్, హుబెయ్ రాజధాని నగరమైన వూహాన్ నగరంలో ఈ ఏడాది జనవరి నెలలో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇది ప్రపంచానికి తెలిసింది. కరోనా వైరస్ గురించి తెలుసుకొని ప్రపంచదేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి .దీనితో, పరిశోధనలు మొదలుపెట్టిన వైద్యులు మరియు శాస్త్రవేత్తలు వైరస్ యొక్క వ్యాప్తి గురించి మరింత తెలుసుకోవడానికి అది ఎక్కడ ఉద్భవించిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైద్యులు తొలి కేసులను కనుగొనగలిగితే, వారు వైరస్ దాగి ఉన్న జంతు హోస్ట్‌ను గుర్తించగలుగుతారు. అప్పటికే ,వైరస్ 180 మందికి పైగా వ్యక్తులకు సోకింది. ఆ సమయంలో ఆ కేసులన్నింటినీ వైద్యులు తెలుసుకోలేకపోయారు అన్ని, కాని రికార్డులను దాటిన తర్వాత మాత్రమే ఆ కేసులను గుర్తించారు అన్ని, చైనా పత్రిక మార్నింగ్ పోస్ట్ నివేదించింది.

 

చైనాలో జన్మించిన కరోనా జనవరి నాటికీ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. ఎన్నో విపత్కర పరిస్థితులను, యుధాలు సైతం ఎదుర్కొన్న దేశాలు కరోనా దెబ్బకు చేతులెత్తేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే చైనాలో మొదలైన కరోనా వైరస్, ప్రపంచ దేశాలలో విస్తరించి ఆర్థిక సంక్షోభంతో పాటుగా, ఆరోగ్య సంక్షోభానికి కారణమైంది. అగ్ర దేశమైన అమెరికా కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ప్రపంచంలోనే కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశాలలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రెజిల్‌ వంటి అగ్ర దేశాల్లో ఒకానొక సమయంలో కోవిడ్‌ వ్యాప్తి చేయి దాటి పొయ్యి, వైరస్ వ్యాపించిన కేసులు , మరణించే వారి సంఖ్యా గణనీయంగా పెరిగిపోయింది. దీనితో ఈ వైరస్ ను అదుపులోకి తీసుకురావడానికి, కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ను విధించి ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఒకరు, ఇద్దరితో మొదలైన ఈ వైరస్‌ వ్యాప్తి కోట్ల మందిని తన గుప్పిట్లోకి లాక్కుంది. లక్షల మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఆర్ఠిక వ్యవస్థను కుదేలు చేసి. అల్లకల్లోలం సృష్టించింది. ఇప్పటికీ దాదాపు అయిదున్నర కోట్ల మంది కరోనాతో పోరాటం చేసినవారే. అయితే మొదట్లో వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉండి జూన్‌, జూలై, ఆగష్టు కాలంలో విజృంభించింది. కరోనా వైరస్ కొన్ని చోట్ల తగ్గుముఖం పడుతుంది, మరికొన్ని చోట్ల కేసు ల సంఖ్యా పెరిగిపోతూనే ఉంది.

 

ఇప్పటి వరకు 55 మిలియన్ల జనాభాకు కరోనా సోకగా 35.2మిలియన్ల మంది కోలుకున్నారు. 1.33 మిలియన్ల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా వచ్చి సంవత్సరమైనా సరైన విరుగుడు లేకపోవడం బాధాకర విషయంగా చెప్పకోవచ్చు. దీనిని కట్టడి చేయాలి అంటే కరోనా కి మందు రక తప్పదు అంటున్నారు నిపుణులు. అయితే ఇంకా టీకా ట్రైల్స్ దశలోనే ఉంది.వ్యాక్సిన్‌ తయారు చేయటం కోసం ఓ వైపు వైద్యరంగ నిపుణులు, కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కానీ, పూర్తి స్థాయి కరోనా టీకా ఇంకా విడదల కాలేదు. తుది దశ క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తర్వాతే టీకా అందుబాటులోకి రానుంది. ప్రయోగాలు సక్సెస్ అయ్యి వ్యాక్సిన్ వస్తే కరోనా నుండి ఒకింత ఊరట . లేదంటే కరోనాతో సహజీవనం చెయ్యాల్సిందే అన్న భావాన్ సర్వత్రా వ్యక్తం అవుతుంది . కరోనా వైరస్ పుట్టి నేటికి సరిగ్గా సంవత్సర కాలమైనా ఈరోజుకీ కరోనా వ్యాక్సిన్ రాకపోవడం, కరోనాని కట్టడి చేయలేక పోవడం గమనార్హం .దేశాలు అన్నిటిని విషాదం లో ముంచేసిన ఈ కరోనా కు అంతం ఎపుడో వేచి చూడక తప్పదు.

 

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju