NewsOrbit
న్యూస్

భారత్ అమ్ములపొదిలోకి మరో ఆధునిక విమానం..! దీని ప్రత్యేకతలు ఏమిటంటే..?

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటుంది. ఈ క్రమంలో భాగంగా అమెరికా నుండి 1.8 బిలియన్ డాలర్ల విలువైన మరో నాలుగు బోయింగ్ పొసిడాన్ 8 ఐ విమానాలను కొనుగోలుకు ఇంతకు ముందే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆమెరికా రూపొందించిన ఈ విమానం బుధవారం గోవాలోని ఐఎన్ఎన్ హాన్స నౌకా స్థావరంలో దిగింది.

అమెరికా అందిస్తున్న నాలుగు పి 8 ఐ యుద్ధ విమానాల్లో ఇది మొదటిది. మిగిలిన మూడు పి 8 ఐ విమానాలు వచ్చే ఏడాది సిద్ధమవుతాయి. కాగా ఇప్పటికే భారత్ వద్ద 8 పి 8 ఐ విమానాలు ఉన్నాయి. వీటిని హింధూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకలు, జలాంతర్గాములపై నిఘా వేయడానికి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో లద్ధాఖ్ ప్రాంతంలో గస్తీకి కూడా వీటిని రంగంలోకి దింపారు.

పొసిడాన్ 8ఐ యుద్ధ విమానం ప్రత్యేకతలు ఏమిటంటే..

సముద్ర జలాలపై గస్తీ తిరుగుతూ సుదూరం నుండే శత్రు దేశాల జలాంతర్గాములను వేటాడుతుంది. అత్యాధునిక శక్తివంతమైన ఎలక్ట్రో అప్టిక్ సెన్సర్ల వ్యవస్థతో, రాడార్ల సహాయంతో జలాంతర్గాముల అనుపానులు కనిపెట్టి ఆయుధాలతో విరుచుకుపడటం దీని ప్రత్యేకత. 907 కిలో మీటర్ల గరిష్ట వేగంతో 1200 నాటికల్ మైళ్ల పరిధి నిఘా సామర్థ్యంతో ఏకధాటిగా నాలుగు గంటల పాటు గస్తీ తిరిగే సౌలభ్యం ఈ విమానాలకు ఉంది.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju