NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మాస్క్ పెట్టకుంటే భారీ జరిమానా.. మీ ఇష్టం!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా నివారణా చర్యలను కఠినంగా అమలవుతున్నాయి. కాగా ప్రజలకు కరోనా వైరస్ నియంత్రణపై డాక్టర్లు, వైద్యులు, ప్రభుత్వాలు పలు సూచనలు చేస్తూనే ఉన్నారు. అయినా కరోనా మాత్రం నిను విడిచి నేనుండలేనంటూ జనాలకు అంటుకుంటూనే ఉంది. కాగా ప్రపంచ దేశాలన్నీ కరోనా నియంత్రించడం కోసం అనేక చర్యలను తీసుకుంటూనే ఉన్నాయి. అలాగే టీకా కోసం పరిశోధనలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు మేం టీకా తయారు చేశామంటూ అధికారికంగా ప్రకటించాయి. అయితే వచ్చే ఏడాదిలో టీకాను బయటకు తెస్తామంటూ పలు సంస్థలు హామీనిస్తున్నాయి.

కాగా అప్పటి వరకు ప్రజలు మరింత కేర్ ఫుల్ గా ఉండాలంటూ ప్రభుత్వాలు ప్రజలకు సూచనలను చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ ఎక్కడ మాకు సోకుతుందన్న ముందున్న భయం ఇప్పుడు ఏ మాత్రం కనిపించడం లేదు. మూతికి మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ అస్సలే పాటించకుండా జనాలు విచ్చల విడిగా తిరిగేస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కొంత మేరకు తగ్గుముఖం పట్టినా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కరోనా వైరస్ విజృంబన రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.

అందుకోసం కఠిన నిర్ణయాలను కూడా తీసుకోబోతోంది. అయితే బుధవారం ఒక్క రోజే దేశ రాజధానిలో 7,400 కు పైగా పాజిటీవ్ కేసులు వచ్చాయి. అలాగే 131 మరణాలు ఆ ఒక్క రోజే జరిగాయి. ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనా కేసులు 5 లక్షలు దాటింది. 7,943 మంది ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు విడిచారు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా నియంత్రణ కోసం గురువారం అఖిల పక్షం సమావేశం నిర్వహించారు. అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి జనాలు పండగలకు, ఫంక్షన్లకు దూరంగా ఉండాలని సూచించారు.

అలాగే వచ్చే ఛట్ పూజను కూడా ఇంటి వద్దే ఉండి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా జరుపుకోవాలని తెలిపారు. మరీ ముఖ్యంగా నదులు, వాగుల వద్ద భారీగా జనాలు గుమికూడొద్దని ఆంక్షలు జారీ చేశారు. అలాగే 200 మంది కలిసి ఒకే చోట కూడి వేడుకలు చేసుకోకూడదని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. దీనితో పాటుగా మరీ ముఖ్యంగా కరోనా నిబంధనలను ఉల్లింగించి మాస్కులు ధరించకుండా బయటకు తిరిగితే వారికి రూ.2 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju