NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

అభి ఆగయా!

వాఘా : మూడు రోజులు పాటు పాక్ కష్టడీలో ఉన్న భారత్ వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను నేడు భారత్‌కు అప్పగించారు. నేటి రాత్రి 9గంటల ప్రాంతంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దు వాఘా వద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్స్ ప్రభాకర్, కపూర్‌లకు అభినందన్ వర్థమాన్‌నుపాక్ అర్మీ అధికారులు అప్పగించారు.

వాఘా వద్ద వర్థమాన్ తల్లిదండ్రులు శోభా వర్థమాన్, ఎయిర్ మార్షల్ ఎస్ వర్థమాన్, భారత వాయుసేన అధికారులు, సిబ్బంది, పెద్ద ఎత్తున ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.

ప్రధాన మంత్రి మోది ఆదేశాల మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ సరిహద్దు వాఘా వద్దకు చేరుకుని స్వాగత కార్యక్రమాలను పర్యవేక్షించారు.

పుల్వామా ఉగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్ జవానులు అసువులు బాసిన నేఫధ్యంలో ఆయిదు రోజుల క్రితం భారత వైమానిక దళం మెరుపుదాడి చేసి పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశారు. దీనికి ప్రతిగా పాక్ వైమానిక దళం భారత్ సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడింది.

వైమానిక దాడుల నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై పాక్ చర్యలను భారత్‌తో సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.

భారత్ వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను సురక్షితంగా అప్పగించాలని భారత్ హుకుం జారీ చేసింది. అగ్రరాజ్యం అమెరికా సైతం పాక్‌కు హెచ్చరిక జారీ చేయడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మేకపోతు గాంభీర్యం వదిలి వింగ్ కమాండర్‌ను భారత్‌కు అప్పగిస్తున్నట్లు గురువారం ప్రకటించారు.

బుధవారం పాక్ యుద్ధవిమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించిన సందర్భంలో భారత్ ఫైటర్ విమానాలు వాటితో తలపడ్డాయి. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తన మిగ్ 21తో ఒక పాక్ 16 విమానం వెంట పడ్డాడు. ఆర్ 73 మిస్సైల్‌ను ప్రయోగించాడు. దానితో ఎఫ్ 16 కూలిపోయింది. అదే సమయంలో దానికి రక్షణగా ఉన్న ఇతర ఎఫ్ 16 విమానాలలో ఒకటి మిగ్‌పై మిస్సైల్ ప్రయోగించడంతో అభినందన్ వర్థమాన్ విమానం కూడా కూలింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పారాచూట్ సహయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడిపోయాడు. పాక్ సైనికులు అతన్ని బంధించారు.

Photo courtesy: DNA India

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Leave a Comment