NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చంద్రబాబు చేసింది తప్పే : పోలవరం మీద మీ మాటేమిటి జగన్

 

1990 కాలంలో మైక్ సెట్ అనేది పెద్ద వినోద సాధనం. మైక్ సెట్ చుట్టూ చేరి పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా ఉండేది కాదు. మైక్ చేతిలో దొరికితే పాపం…. ఆ పిల్లాడి మొహం లో ఒక హీరోయిజం వచ్చేది.. ఇప్పుడు అచ్చం ఏపీ అసెంబ్లీ లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం నాయకులు చిన్నపిల్లాడి వేషాలు వేస్తే, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటుంది. మైక్ చెట్టు ఎక్కువగా అధికార పార్టీ చేతిలోనే ఉండే అవకాశం శాసనసభలో ఉండటంతో, దాన్ని వారు ఇష్టానుసారం వినియోగించుకుంటున్నారు. ప్రజలకు చెప్పాల్సింది చెప్పకుండా భజనలు విక్రం తనతోనే శాసనసభ కాలం సరిపోయేలా ఉంది. ఇదంతా ఎందుకంటే బుధవారం పోలవరం పై చర్చ సందర్భంగా ఎపి అస్సెంబ్లీ లో కనిపించిన దృశ్యాలు చాల మంది కి నవ్వు తెపించేది గా వున్నా పోలవరం ప్రాజెక్ట్ పురోగతి మీద చర్చ మాత్రం పక్క దరి పట్టిందనేది అక్షరాలా సత్యం

చంద్ర బాబు చేసింది అక్షరాలా తప్పే

పోలవరం చర్చ;లో భాగంగా ముఖ్య మంత్రి జగన్ తెలుగుదేశం పార్టీ హయం లో పోలవరం నిర్మాణం,పనుల పురోగతి నిర్వాసితులకు చేసిన న్యాయం తదితర విషయాలు చెప్పుకొస్తూనే తెదాపా హయం లో కేవలం పోలవరం ప్రాజెక్ట్ సందర్శన కోసం బస్సులు పెట్టి జనాన్ని తీసుకువెళ్లి అక్కడ భజనలు చేయించిన విషయం జగన్ సభ పూర్వకంగా వీడియో రూపమ్ లో ప్రదర్శించి సభలో నవ్వులు పూయించడం బుధవారం సభలో హైలైట్. దీనికోసం చంద్ర బాబు 86 కోట్లు ఖర్చు చేసారని నివ్వెర పరిచారనే అంశాన్ని జగన్ సభ దృష్టికి తీస్కోచ్చారు. ఇది నిజం గా చర్చ చర్చించాల్సిన విషయం. దీని కేవలం కామెడీ విషయం గా మాత్రమే ప్రభుత్వం టిస్కుండి తప్ప అంత మొత్తంలో బాబు ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారనే విషయం మీద ఆయనను నిల దీసి ఉంటే జగన్ తెలివి మరోలా ఉండేది.పూర్తి కానీ ప్రాజెక్ట్ వద్దకు సందర్శన పేరుతొ జనాలను తీసుకు వెళ్లి భజనలు చేయెంచుకొని ప్రజాధనాన్ని తెదేపా ప్రభత్వం ఎలా వేస్ట్ చేసిందో జనాలకు తెలిసి ఉండేది. దాన్ని జగన్ కేవలం నవ్వడానికి మాత్రమే వినియోగించుకుని మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనేది రాజకీయా విశ్లేషకుల మాట.

వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు 42 సార్లు

పోలవరం చర్చలో భాగంగా ముఖ్యమంత్రి విషయాన్ని వివరిస్తూ ”దివంగత నేత ప్రియతమా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ”అనే పదాన్ని 42 సార్లు ఉచ్చరించారు. అయన హయం లో పోలవరం పనులు ఎంత వేగంగా జరిగాయనేది వివరించే ప్రయత్నం చేసారు. కుడి ఎడమ కాలువలు తవ్వకంలో పురోగతి, తర్వాత పట్టిసీమ ప్రాజెక్ట్ కు అవి ఎంతలా ఉపయోగ పడ్డాయో వివరించే ప్రయత్నం చేసారు. ఆయన హయం లోనే ప్రాజెక్ట్ కు అన్ని రకాల అనుమతులు వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన జగన్ వైఎస్ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయాన్నీ ఎంత సిరిఫోస్ గా తీసుకున్నారో చెప్పారు. అయితే జగన్ వైఎస్ కు వ్యక్తిగత ఇమేజ్ పెంచాలని చుసిన అది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పురోగతిగానే ఇప్పటికి కాంగ్రెస్ చెప్పుకుంటుంది అన్నది ఆయన తెలుసుకోవాలి.

29 శాతం సరే… మీరు చేసిందేంత

ప్రతి సోమవారాన్ని పోలవరం కింద మారుస్తూ కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టు బాధ్యతలను సైతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మరి అడిగి తెచ్చుకున్న చంద్రబాబు హయాంలో పోలవరం పురోగతి అంతంత మాత్రమే జరిగిందని జగన్ లెక్కలతో సహా చెప్పారు. చంద్రబాబు హయాంలో కేవలం పోలవరం మొత్తం 29 శాతం మాత్రమే పూర్తయిందని, దాన్ని చంద్రబాబు 70 శాతం పూర్తయిందని చెప్పుకున్నారని జగన్ వివరించారు. ఇంత వరకు బాగానే ఉన్నా 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం పురోగతి గురించి ముఖ్యమంత్రి చెప్పకపోవడం, దానిమీద కనీసం ఎంత పనులు పూర్తయ్యాయి అనేది సభకు తలపక పోవడం విశేషం. రివర్స్ టెండరింగ్ పేరుతో 13 వందల కోట్లను ముగించమని మాత్రమే సీఎం చెప్పుకొచ్చారు. పోలవరం పనుల పురోగతి ప్రస్తుతం ఎంతమేర పనులు అయ్యాయి.. దానిలో ఉన్న అడ్డంకులు… కేంద్రం నుంచి రావాల్సిన నిధులు… కేంద్రం చెబుతున్న సమస్యలు…. 2014 15 నాటి అంచనాల మేరకు కేంద్రం నిధులు అందిస్తామన్నా వైఖరి… పునరావాస సమస్యలు… ముంపు గ్రామాల పరిస్థితి… తెలంగాణ నుంచి ఆంధ్రా లో కలిసిన మండలాల పరిస్థితి… అలాంటి కీలకమైన విషయాలు వస్తావని ముఖ్యమంత్రి చేయకపోవడం పోలవరం చర్చలో అసంపూర్తి కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం విపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యతిరేకించేందుకు మాత్రమే పోలవరం చర్చను జగన్ వినియోగించుకున్నారని, అలాగే వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన పనులను ఒకసారి సభకు తెలియపరచాలని తాపత్రయమే కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పనుల పురోగతి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది అన్న అంశాలను పోలవరం విషయంలో చెబితే కాస్త స్పష్టత వచ్చేదని ప్రభుత్వానికి మంచి మార్కులు పడేవని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju