బిగ్ బాస్ ఇంటిలో అవినాష్ ది చాలా విచిత్రమైన క్యారెక్టర్ అనే చెప్పాలి. మొదటేమో అందరినీ నవ్విస్తూ సరదా మనిషి గా కనిపించినా టాస్క్ లు వస్తే మాత్రం అపరిచితుడిలా మారిపోతాడు. ఎవరో ఒకరి పై అంత ఎత్తున లేస్తాడు. ఎందుకు ఎవరి మీద అరుస్తున్నాడో తెలియనట్లు గా ప్రవర్తిస్తున్నాడు కానీ అతని మాటల్లో లాజిక్ లు ఉంటాయి.
గత వారం నామినేషన్ ప్రక్రియ లో మోనాల్ ను కూడా అలాగే లాజిక్ తో కొట్టాడు. ఇప్పుడు సోహెల్ వంతు అయింది. తాజాగా సోహెల్ నోరు మూయించాడు. మొదటి లెవెల్ లో భాగంగా పాలుపట్టే టాస్క్ లో అఖిల్, సోహెల్ ఇద్దరూ కలిసి గేమ్ ఆడారు కానీ బయట మాత్రం అదేమీ లేదని అబద్ధం చెప్పారు. అలా చెప్పకపోయినా వారిద్దరూ తమ పాలను పంచుకోవడం కెమెరా లో చూడవచ్చు. ఇలా కలిసి ఆడడం పై అవినాష్ సోహెల్ ను ప్రశ్నించాడు.
రెండో లెవల్ కి నలుగురు వెళ్లారు…. కానీ అవినాష్ గట్టెక్కలేపోయాడు. ఇక అవినాష్ సోహెల్ తో మాట్లాడుతూ ఇద్దరు లేదా ముగ్గురు తర్వాతి లెవల్ కు వెళ్తారు… అప్పుడు మీరు కలిసి ఆడతారా…. లేక విడివిడిగా ఆడుతారా అని ప్రశ్నించాడు. అప్పుడు సోహెల్…. అప్పుడు మాత్రం మాత్రం విడివిడిగానే ఆడతామని నోరు జారాడు. ఆ మాటలు వెంటనే అవినాష్ పట్టుకున్నాడు. అంటే ఇంతకుముందు కలిసి ఆడినట్లే కదా అని ప్రశ్నించాడు.
ఒక్కసారిగా సోహెల్ కు దిమ్మతిరిగిపోయింది. దీంతో అవినాష్ పైన మాటల దాడి చేశాడు. ఒంటరిగా ఆడు… ఒంటరిగా ఆడు అని నువ్వు ప్రతిసారి చెప్పకు… మేము ఏదో తప్పు చేస్తున్నట్లు ఎలా ఆడాలో మాకు తెలుసు ఇది మా తెలివి అని ఫైర్ అయ్యాడు…. కానీ సరైన సమాధానం చెప్పలేకపోయాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!