బిగ్ బాస్.. ఇండియాలోనే మూడు ప్రధాన భాషల్లో సాగుతున్న అతిపెద్ద రియాలిటీ షో అన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు సీజన్ త్రీ విజయవంతంగా ముగించుకున్న ఈ షో కంటెస్టెంట్లు ఎందరో బయటకు వచ్చి కొందరు చిత్రపరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకోగా మరికొందరికి అయితే అసలు అవకాశాలే లేకుండా పోయాయి. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో కొంతమంది పాపులారిటీ సంపాదిస్తే, మరికొందరు ఎవరో కూడా మనకు అంత పెద్దగా తెలియదు. అయితే ఈ మధ్య స్టార్ట్ అయినా బిగ్ బాస్ సీజన్ 4 లో 14 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దివి వడ్త్య పేరు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకు ముందు తనెవరో మనకి సడన్ గా గుర్తు రాలేదు.
ఇక దివ్య మహర్షి సినిమాలో యాక్ట్ చేసారు. కానీ ఆమె క్యారెక్టర్ అంతగా గుర్తింపు పొందలేదు. అయితే మోడల్‌గా పలు షోస్‌లో సందడి చేసిన దివి బిగ్‌బాస్ ద్వారా బుల్లితెర వీక్షకులతో పాటు వెండితెర ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యింది. తన సొట్టబుగ్గలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న దివికి ఈ మధ్య టాలీవుడ్లో అవకాశాలు వెల్లువలా వస్తున్నాయట. అందంగా కనిపించడంతో పాటు చక్కటి అభినయం ప్రదర్శించగల కథానాయిక పాత్రలకు దివి మంచి ఆప్షన్ అని టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు భావిస్తున్నారట. ఇకపోతే బిగ్ బాస్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో చెప్పిన ప్రకారం దివి ఒక మోడల్. దివి తల్లి, సోదరుడు డాక్టర్స్ అని పేర్కొంది.
కాగా ఇప్పటికే దివి కథానాయికగా రెండు మూడు చిత్రాల్లో ఎంపికయ్యిందని పూర్తి వివరాలు త్వరలో ఆ చిత్ర దర్శక, నిర్మాతలు వెల్లడిస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు బిగ్ బాస్ నుండి ఎలిమేట్ అయిన వారిలో చాలా తక్కువ కంటెస్టెంట్స్ మాత్రమే ఇలా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఆకోవలో ఇప్పుడు దివి చేరిందని అనుకుంటున్నారట. మొత్తానికి బిగ్ బాస్ నుంచి ఎలిమినేటైతేనేమి. ప్రొడ్యూసర్స్ అందరినీ తన చుట్టూ తిప్పుకుంటున్న దివి నక్కతోక తొక్కినట్లు ఉందని అంటున్నారట. మరి అదృష్టం అంటే ఇదే.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!