NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ రాజ‌కీయాలు

వెన్నుపోటు పొడిచారు… కేసీఆర్ గురించి న‌మ్మిన‌బంటు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం అనేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఒక‌నాడు ఏకు మేకు అవుతాడు అనుకున్న నాయ‌కుడే ఇప్పుడు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారుతున్నారు. ఇది తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విష‌యంలో జ‌రుగుతోంది.

గత కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు టిఆర్ఎస్ వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాను పార్టీ మారడం లేదు అని ఆయన చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా దీనికి కొన‌సాగింపుగా ఇంకో తీపిక‌బురు వినిపించారు.

 

వెన్నుపోటు రాజ‌కీయం ….

నూతన సంవత్సరం 2021వ సందర్భంగా సత్తుపల్లిలో తనను కలిసిన పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖ‌మ్మం జిల్లా ప్రజల అవసరాల కోసం , అభివృద్ధి కోసమే తాను ఉన్నాన‌ని తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌క‌టించారు. ఆనాటి నుంచి నేటి వరకు.. ఎన్టీ రామారావు, చంద్రబాబు, కేసీఆర్‌ల సహకరంతో జిల్లాను అభివృద్ధి చేశానని గుర్తుచేశారు. రాజకీయాల్లో జరిగిన తప్పులు, పొరపాట్లు, వెన్నుపోట్లు, ఏమరుపాటు కావొచ్చు… మనతో లబ్ది పొందిన వారు ఉండొచ్చు.. కానీ, మనకు తాత్కాలిక దెబ్బ తగిలింది… మనం దెబ్బతిన్నాం అని తుమ్మ‌త‌ల నాగేశ్వ‌ర‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.. అయినా మీ వెంట నేను ఉంటాను.. రాబోయే రోజుల్లో.. మీకు అండగా నేను, నాకు అండగా మీరు ఉండాలని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు .

ఇన్ని వేల మంది నాకోసం….

గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ, ఇతర పథకాలను విజయవంతంగా ఉపయోగించుకున్నామని తుమ్మ‌ల‌ అన్నారు. అయితే, స్వార్ధపరులు, అధికారం కోసం అర్రులు చాచినవాళ్లు మనలను ఓడించారంటూ హాట్‌ కామెంట్లు చేశారు. రాజకీయాల్లో ఆటుపోట్లు, గెలుపు ఓటములు ఉంటాయి… ఓటమి గురించి ఆలోచించకుండా.. రాజకీయాలను కొనసాగిస్తా… జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. రాజకీయ కారణాలు ఎలా ఉన్న కొంత కాలం సర్దుకుని పోవాలని కార్యకర్తలకు సూచించిన ఆయన.. తాత్కాలిక ఇబ్బందులు వచ్చినా.. మిమ్ములను కడుపులో పెట్టుకుని చూసుకుంటాను.. ఇన్ని వేల మంది నాకోసం రావడం ఆనందం ఉందన్నారు..

2021 గుడ్ న్యూస్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2020 కలసి రాలేదు, కరోనా, అధిక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడ్డాం.. కేసీఆర్ సర్కార్ రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేసినప్పటికీ… ప్రకృతి వల్ల ఇబ్బందులు పడ్డాం అన్నారు.. సీఎం కేసీఆర్ కు మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కుంటుపడ్డాయి… వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు .

Related posts

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?