NewsOrbit
న్యూస్

అజ్ఞాతంలోకి మాజీ సీఎం భార్య!అసలేం జరిగింది?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రెండో భార్య , ప్రముఖ కన్నడ సినీనటి రాధికా కుమారస్వామి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిందన్న వదంతులు కన్నడనాట కలకలం రేపుతున్నాయి.

కన్నడ, తెలుగుతోపాటు పలు ప్రాంతీయ భాషల సినిమాల్లో నటించిన రాధిక తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన మాజీ ప్రధాన తనయుడు దేవెగౌడ కొడుకు, మాజీ సీఎం కుమారస్వామిని పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తుండడం శాండిల్ వుడ్.. కన్నడ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమెకు పోలీసులు అరెస్టు చేసిన మోసగాడితో సంబంధాలున్నాయన్న వ్యవహారం సంచలనం రేపింది.ఈ కేసు విషయమై ఆమె నేరుగా శుక్రవారం రాత్రి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

మోసగాడి తో సన్నిహిత సంబంధాలు:ఆర్థిక లావాదేవీలు

ఆర్ఎస్ఎస్ నాయకుడినని.. జ్యోతిష్యుడినని.. ప్రముఖులతో సంబంధాలున్నాయని చెప్పుకుని ఉద్యోగాలిప్పిస్తానంటూ అనేక మందిని మోసం చేసిన 52 ఏళ్ల యువరాజ్ అలియాస్ స్వామితో సంబంధాలపై బలమైన ఆధారాలున్నాయని పోలీసులు ప్రకటించిన నేపధ్యంలో ఆమె విచారణకు హాజరుకావడం హాట్ టాపిక్ అయింది. ఉద్యోగాల పేరుతో అనేక మందిని మోసం చేసి డబ్బులు వసూలు చేసిన యువరాజ్ రూ.75 లక్షల నగదును రాధికా కుమారస్వామి ఖాతాలో వేసినట్లు బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసులు చెబుతున్నారు. గత డిసెంబర్ 16న యువరాజ్ అలియాస్ స్వామిని అరెస్టు చేసిన అనంతరం పోలీసులు అతని ఇంట్లో జరిపిన సోదాల్లో 91 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన 100కు పైగా చెక్కులు దొరికాయి.

లాక్ డౌన్ కు ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో యువరాజ్ అలియాస్ స్వామి రెండు విడుతలుగా 75 లక్షల రూపాయలు రాధికా కుమారస్వామి ఖాతాలో వేశాడు. మొదటి విడుత 15 లక్షలు వేసి.. రెండో విడుత 60 లక్షలు తన బావమరిది ఖాతా నుండి వేయించాడు. ఈ లావాదేవీల గురించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించగా.. తాను తీయబోతున్న సినిమాలో తాను ఒక ప్రధానపాత్ర వేయడం కోసం డబ్బిచ్చాడని రాధికా కుమారస్వామి బదులిచ్చారట. అయితే తీయబోయే సినిమాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేదా అగ్రిమెంట్ లాంటివేవీచూపించలేదని పోలీసులు అంటున్నారు. స్వామి తనకు 17 ఏళ్లుగా తెలుసునని రాధిక  చెప్పిందట.

జ్యోతిష్యుడిగా తన . కెరీర్.. పెళ్లి.. తన తండ్రి అనారోగ్యం.. చావులతోపాటు అనేక విషయాల్లో ముందే చెప్పడంతో యువరాజు అలియాస్ స్వామిపై తనకు చాలా నమ్మకం, గురి ఉన్నాయని.. అలాంటి వ్యక్తి ఛీటింగ్ కేసులో అరెస్టు కావడం షాక్ కి గురిచేసినట్లు పోలీసులకు తెలియజేసింది.మార్చి నుండి నిన్న మొన్నటి వరకు లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో ఏ సినిమా తీయబోతున్నారన్నది అటు యువరాజ్ అలియాస్ స్వామి గాని.. ఇటు రాధిక గాని నిర్దిష్టంగా చెప్పలేకపోవడంతో విచారణ అసంపూర్తిగానే ముగిసినట్లు తెలుస్తోంది.  మరోసారి విచారణకు పిలిచినప్పుడు రావాలంటూ ఆమెను బెంగళూరు పోలీసులు పంపించివేశారు.అలాగే తమకు సమాచారం ఇవ్వకుండా బెంగళూరు నగరం దాటి వెళ్లకూడదని పోలీసులు ఆంక్షలు పెట్టడంతో ఆమె సరేనంటూ వెళ్లినట్లు సమాచారం.

ఆ తర్వాత నుండి అడ్రస్ గల్లంతు!

పోలీసుల విచారణ నుండి ఇంటికొచ్చిన రాధిక ఆ తర్వాత ఇంట్లో నుంచి గుర్తు తెలియని చోటకు వెళ్లిపోవడంతో ఆమె అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయందని ప్రచారం జరుగుతోంది. పోలీసుల ఆంక్షల నేపధ్యంలో ఆమె బెంగళూరులో సిటీ పరిధిలోనే తన సన్నిహితుల ఇంట్లో తలదాచుకుంటున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు పోలీసులు.. ఇటు రాధికా కుమారస్వామి గాని ఎలాంటి స్పష్టమైన ప్రకటనలు చేయకపోవడంతో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి.

 

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju