NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తులనాడితే తూలిపోతాం, తేలిపోతాం జగన్!!

 

 

భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకు ఒక విశిష్టమైన ప్రత్యేక గుణం ఉంటుంది… రాజ్యాంగం పాలనను, రాజ్యాంగ బద్ధంగా నిర్వహించే పదవులను వేర్వేరు చేసింది. పాలకులు పదవుల్లో… రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్నవారు పాలనలో కల్పించుకోవడానికి వీలు లేదు. ఈ విధంగానే రాజ్యాంగం ఎవరికీ ఏం చేయాలో ఎలాంటి విధులు ఉంటాయో ఎలాంటి అధికారాలు ఉంటాయో కూడా స్పష్టం చేసింది. అందుకే మన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగము గా గుర్తించబడింది. ప్రతి వివాదానికి ప్రతి అంశానికి రాజ్యాంగంలో ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన ఈ విషయాలు మనకు ఎందుకు లెండి అంటారా…??? ముఖ్యమంత్రి జగన్ నెల్లూరులో అమ్మఒడి రెండోదశ శ్రీకారం చుట్టిన సందర్భంగా చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారిపై ఒక పాలకుడు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయొచ్చా అనే కీలకమైన అంశాన్ని లేవనెత్తుతున్నాయి. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రెస్ మీట్ పెట్టి మరి వాయించేసిన జగన్… మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను చంద్రబాబు కోవర్టు బహిరంగ సభ వేదికగా ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

ఎందుకీ అసహనం!!

ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలపై నోటిఫికేషన్ ఇచ్చారు. జనవరి 23 నుంచి స్థానిక ఎన్నికల హడావుడి మొదలవుతుందని ఆయన నోటిఫికేషన్ లో ఉంది. అయితే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు పోలీసులు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఎన్నికలు మేం నిర్వహించాలేమని, వాటిని బహిష్కరిస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారు. దీని పైన ప్రభుత్వం సైతం హైకోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉన్న సమయంలోనే జగన్ తన అక్కసును, అసహనాన్ని బహిరంగంగా వ్యక్తపరిచిన ట్లు ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో అందులోనూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వంటి ప్రధాన హోదాలో ఉన్న వ్యక్తి మీద ఓ పార్టీ ముద్ర వేసి జగన్ మాట్లాడడం వల్ల ఆయనే మరింత ఇమేజ్ కోల్పోవడం తప్ప పెద్దగా ఒరిగిందేమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు జగన్ కు ప్రచ్ఛన్నయుద్ధం సాగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు కోర్టులో ఉన్న అంశం మీద ప్రభుత్వం ఫైట్ చేయాల్సింది పోయి వ్యక్తిగతంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరణం వల్ల జగన్ కు వచ్చే దానికన్నా పోయేదే ఎక్కువ.

ఫలితం తెలుసు!!

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో ఢీ అంటే ఢీ అని తలపడడం చరిత్రలో ఇదే ప్రథమం. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి యంత్రాంగానికి ఎన్నికలు వద్దు అని చెప్పే హక్కు లేదు. ప్రజాస్వామ్య దేశంలో కాలం పూర్తయ్యేసరికి కచ్చితంగా ఎన్నికలు జరపాలి. ప్రతి పదవి కి ఉన్న పదవి పరిమితి దాటి ఉండడానికి లేదు. పాలకులే చట్టాలు చేసుకొని తాము అదే పదవిలో కొనసాగుతారు అంటే కుదరదు. అందుకే దీనికి అర్థం నిర్దిష్టమైన యంత్రాంగం రాజ్యాంగబద్ధ హోదాలో ఉంటుంది. అదే ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికల కమిషన్ కు ఎప్పుడు ఏ ఎన్నికలు జరపాలి ఎలా జరపాలి దానికి ఎలాంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి అన్న అంశాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా ధీమాగా ఉన్నారు. కోర్టులో ఆయనకు ప్రతికూలమైన తీర్పు వచ్చే అవకాశం లేదని ఆయనకు తెలుసు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కోర్టులు ఇష్టానుసారం తీర్పు ఇవ్వడానికి లేదు. దీనిని బట్టి భవిష్యత్తులో హైకోర్టులో లేదా సుప్రీం కోర్టుకు వెళ్ళినా జరగబోయేదేమిటి అన్నది రమేష్ కుమార్ కు తెలిసే ఆయన ఆయన పనులు చేసుకుంటున్నారు. దీనిపై న్యాయ నిపుణులు సైతం జగన్కు విషయం వివరించినా సరే ఆయన ఈ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం కనిపించడం లేదు. కచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి సుప్రీంకోర్టు ఫీజులకు ప్రజాధనాన్ని వృధా చేసి అక్కడ సైతం ఓ రకమైన తీర్పును విన్న తర్వాత మాత్రమే జగన్ స్థిమిత పడే అవకాశం ఉంది. అప్పటికి టైం ను సాగదీసి… ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తి అయితే వెంటనే జగన్ కోర్టులో మాట విని ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడతారు. ఆయన టార్గెట్ ఏమంటే ఇప్పుడు ఈ విషయాన్ని మరింత కాలం సాగదీత కు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించడమే. అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తి అయ్యే వరకూ ఈ కేసును తేలకుండా సాగదీసే అంశాలు ఏమన్నా ఉన్నాయా అనేది జగన్ ప్రధాన టార్గెట్..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju