ఉప్పెన.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా. సుకుమార్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా uppena అన్నీ కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిచిన సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో రికార్డ్స్ సాధిస్తున్నాయి. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతుండగా యంగ్ బ్యూటి కృతిశెట్టి కూడా ఈ సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
అయితే మరో వారం రోజుల్లో భారీ ఎత్తున uppena సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ రెడీ అవుతుండగా థియేటర్స్ మూత పడ్డాయి. అంతే అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మధ్యలో చాలా సార్లు ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కాని మేకర్స్ మాత్రం మెగా ఫ్యామిలీ హీరో డెబ్యూ సినిమా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే సంక్రాంతి బరిలో దిగుతుందని భావించినప్పటికి ఎందుకనో uppena సంక్రాంతి బరిలో నిలవలేదు. దాంతో అందరు లవ్ స్టోరీ కాబట్టి ఫిబ్రవరి 14 న రిలీజ్ అవుతుందని చెప్పుకున్నారు. కాని తాజా సమచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 5 న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ విషయన్ని త్వరలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో నటించిన సినిమా కూడా త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగున్నాయని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.