NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తలైవా… ఎంత దెబ్బ కొట్టావయ్య!!

 

 

అదిగో వచ్చేస్తున్న…. ఇదిగో వచ్చేస్తున్నా.. మనది ఆధ్యాత్మిక పార్టీ… మనవి నీతివంతమైన రాజకీయాలు అంటూ ఎన్నో ప్రకటనలు ఇంకా ఎన్నో ఆశలు రేపిన తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానుల పరిస్థితి పగవాడికి కూడా రాకుడదన్న చందంగా తయారు అయ్యింది. ఆయనని నమ్ముకొని రాజకీయంగా ఎడుగుదామని, చక్రం తిప్పొచ్చని కలలు కన్నా ఆయన పార్టీ అభిమానులు అభిమాన సంఘ నాయకులు ఉన్నదంతా ఊడ్చుకుని ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో వేరే పార్టీలోకి వెళుతున్నారు. అక్కడి నాయకులు రజనీ అభిమానులు చూసి ఓ వెకిలి నవ్వు నవ్వుతూ పార్టీ కండువాలు కప్పి వెనుక వరుసలో నిలబడండి అని చెప్పడం రజిని మక్కల్ మండ్రం నేతలకు బలే కోపం, విసుగుతో కూడిన ఆవేదనను మిగులుస్తోంది. ఇన్నాళ్ళు రజిని నమ్ముకొని ఇంకేదో సాధిస్తారని ఎంతో ఆశతో… ఆశయంతో ఆయన వెంట నడిచిన అభిమానులకు రజిని ఇచ్చిన పెద్ద బహుమతి ఇటు కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది.

ఎవరికీ ఇష్టం వచ్చిన పార్టీలోకి వారు!

ఇప్పటివరకు రజిని పార్టీ పెడతారని ఆయన అభిమాన సంఘ నాయకులు అంత రజని మక్కల్ మండ్రం కింద పని చేశారు. రజినీ పార్టీ పెడితే వీరంతా దాని లోకి వెళ్లి సేవలందించాలని ఆరాటపడ్డారు. ఎన్నో సమావేశాల్లో రజిని సైతం కంగారు పడవద్దు అని, సరైన సమయంలో పార్టీ పెడతామంటూ వారిని ఊరిస్తూ, రాజకీయ ఆశలు పెంచుతూ వచ్చారు. డిసెంబర్ 31వ తేదీన పార్టీ ప్రకటన, విధివిధానాలు తదితర విషయాలపై రజిని ప్రకటన చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కసారిగా రజనికీ అశ్వస్థత… వారం పాటు ఆస్పత్రి లో ఉండటం… వచ్చిన వెంటనే పార్టీ పెట్టడం లేదన్న ప్రకటన రజిని చెయ్యడం అభిమానులను హతశుతులను చేసింది. ఒక్కసారిగా అభిమానులంతా కుప్పకూలిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకుని మరెన్నో కలలు కన్న అభిమానం నేతలంతా కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రజని మక్కల్ మండ్రం నాయకులు వివిధ పార్టీల కండువాలు కప్పుకుఅంటున్నారు.

డీఎంకే లోకి ఎక్కువగా!

స్టాలిన్ నేతృత్వంలో తమిళనాడు లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎంకేలో కి ఎక్కువ మంది రజనీ అభిమానులు చేరుతున్నారు. అధిక శాతం మంది ఆ పార్టీలోనే వివిధ విభాగాల్లో పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. రజిని ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ప్రకటించిన దానికి వ్యతిరేకంగా డీఎంకేకు పూర్తిస్థాయిలో కష్టపడాలని రజని మక్కల్ నేతలు బలంగా భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ కనుక రజనీకి దగ్గర మద్దతు కోరితే దానికి తలైవా సైతం ప్రకటన చేసిన దానికి అనుగుణంగా పని చేసేందుకు మాత్రం అభిమానులు సిద్ధంగా లేరు.

ఇంక నయం మధ్యలో వదిలేయలేదు!

రజినీ ప్రకటన, పార్టీ రద్దు విషయాలపై తమిళనాడులో రకరకాల మాటలు, వెక్కిరింతలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు విపరీతంగా నడుస్తున్నాయి. పార్టీ పెట్టకు ముందే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు… అలా కాకుండా పార్టీ పెట్టిన తర్వాత జనం లోకి వెళ్ళిన తర్వాత రజనీ కు అస్వస్థత చేకూరి, పార్టీ అప్పటికప్పుడు రద్దు చేస్తే తామంతా మరింత దారుణంగా రోడ్డుపాలు అయ్యేవారని, డబ్బు పెట్టి పార్టీ రద్దు అప్పటికప్పుడు రజిని ప్రకటించి ఉంటే చావే శరణ్యం అని… ఒక రకంగా ముందుగానే పార్టీ రోడ్డు ప్రకటన చేసి రజిని మంచి చేశారంటూ వెటకారపు ధోరణితో సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు చేస్తున్నారు.

పెట్టి ఉంటే ఎం జరిగేదో!

రజిని వయసు 70 కి వచ్చేసింది. ఆయనకు కిడ్నీ సమస్య ఉంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీంతో నీరజని ప్రతిసారి అస్వస్థతకు గురవుతారు. ఒకవేళ పార్టీ పెట్టిన తర్వాత రజనీ అస్వస్థతకు గురై.. పార్టీపై పట్టు కోల్పోతే అది మరింత ప్రమాదకరం అయ్యేది. తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం సరళి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి చిన్న గ్రామంలోనూ మాట్లాడాలని అక్కడివారు పట్టుబడతారు. అందులోనూ వ్యక్తిపూజ తమిళనాడులో మరీ అధికం. రజనీకాంత్ వంటి నాయకుడు ప్రజల్లోకి వెళితే వచ్చే జనం తో పాటు ఆయన మీద అభిమానులు కురిపించే అపారమైన ప్రేమతో ఆయన మరింత అనారోగ్యం గురి అయ్యేవరని..ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పార్టీ ప్రకటన విరమించుకోవడం మంచిది అయిందని వైద్యులు సూచిస్తున్నారు.

క్రేజ్ తగ్గిన తలైవా!

తమిళనాడులో గతంతో పోలిస్తే పార్టీ ప్రకటన రద్దు తర్వాత రజనీకాంత్ క్రేజ్ కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది. ఆయన అభిమానులంతా వివిధ పార్టీ లోకి వెళ్లి పోవడం రజినీ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించడంతో ఆయన క్రేజ్ అభిమానుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అయితే ఈ సారి రసకందాయం గా జరుగుతాయి అనుకున్నా తమిళనాడు ఎన్నికల్లో ఈసారి రజినీకాంత్ ఈ పార్టీకి మద్దతు పలుకుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటు బీజేపీ పెద్దలు సైతం రజనీకాంత్ తో టచ్ లో ఉన్నారు. బిజెపి కు మద్దతు ప్రకటించాలని దీనివల్ల తమిళనాడులో బిజెపి బలం పుంజుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు. అన్నాడీఎంకే ను ముందుకు నడిపించే నాయకులు పెద్దగా లేకపోవడంతో… రజనీ మద్దతు కనుక ఇస్తే అది అన్నాడీఎంకే బీజేపీ కూటమి కు ఎంతో ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. మరి పార్టీ రద్దు చేసిన తలైవా తన తర్వాతి అడుగును రాజకీయాల్లో వేయబోతున్నార లేక మద్దతు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమే.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!