జాతీయం ట్రెండింగ్ న్యూస్

డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను తోసిరాజన్న జో బైడెన్..!

Share

అమెరికా నూతన అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ తొలి రోజే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో ఇచ్చిన పలు ఆదేశాలను జో బైడెన్ వెనక్కు తీసుకున్నారు. 15 కార్యనిర్వహక ఆదేశాలపై బైడెన్ సంతకం చేశారు. ఈ సందర్భంలో బైడెన్ మాట్లాడుతూ ట్రంప్ పాలనలో విసిగిపోయి తనకు మంచి విజయాన్ని అందించిన ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను తోసిరాజన్న జో బైడెన్..!
America new president jo Biden sign on important bills

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) నుండి ఆమెరికా వైదొలగుతూ గతంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్ నిలిపివేశారు. సాంక్రమిక వ్యాధుల నిపుణుడు అంటోనీ ఫౌసీ నేతృత్వంలోని బృందం డబ్ల్యుహెచ్ఒ సమావేశాలకు ఇకపై ప్రాతినిధ్యం వహించనుందని పేర్కొన్నారు. అదే విధంగా ట్రంప్ హయాంలో ఆమెరికా పారిన్ వాతావరణ ఒప్పందం నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. పారిన్ వాతావరణ ఒప్పందంలో ఆమెరికాను భాగస్వామ్యం చేస్తూ నూతన అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం దేశాలకు రాకపోకలపై ట్రంప్ విధించిన నిషేదాన్ని జోబైడెన్ ఎత్తివేశారు.

ప్రధానంగా ట్రంప్ మానస పుత్రికగా భావించే మెక్సికో గోడ నిర్మాణం నిమిత్తం నిధుల సమీకరణకు గత ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ ను జో బైడెన్ నిలిపివేశారు. గ్రీన్ కార్డుల జారీ పై దేశాల వారీగా పరిమితిని జోబైడెన్ ఉపసంహరించారు. బాల్యంలోనే అమెరికాకు వలస వచ్చిన వారికి శాశ్వత నివాసం, పౌరసత్వం కల్పించే నిర్ణయంపైనా సంతకం చేశారు. జాతి వివక్ష నిర్మూలనకు గానూ మత పరమైన మైనార్టీ వ్యక్తుల సమాన హక్కులను నిర్వచిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి..అమెరికా 46వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్


Share

Related posts

Prabhas: ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్..!!

sekhar

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ర‌కుల్.. ఏకంగా ఆయన పక్కనే..!

Teja

Ycp Leader Arrest: 1200 కోట్ల చిట్ ఫండ్ స్కామ్..! ఆ వైసీపీ నేతను అరెస్టు చేసి తీసుకువెళ్లిన ఒడిశా సీఐడీ పోలీసులు..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar