NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

వైసీపీ ప్రభుత్వానికి కీలక పాయింట్ లు అందించిన బీజెపీ నేత

ఏపి రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తున్నది రాజధాని ప్రాంతంలో జరిగిన భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహరం. ఇది క్రిమినల్ కేసు కాదు అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం టీడీపీ వర్గాలకు హాపీ న్యూస్ అయ్యింది. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులను, వారికి మద్దతు ఇస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేయాలన్న వైసీపీ ప్రభుత్వ వ్యూహానికి హైకోర్టు గండికొట్టినట్లు అయ్యింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ఏపి సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేయడంతో వైసీపీ ప్రభుత్వ తదుపరి వ్యూహం ఏమిటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో వైసీపీ ప్రభుత్వానికి కీలక పాయింట్ లను అందించారు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత బీజెపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు,

ex ap cs iyr krishna rao told key points in insider trading

ప్రభుత్వం తప్పకుండా సుప్రీం కోర్టుకు అప్పీల్ చేయాల్సిన కేసు ఇది అంటూ ఐవైఆర్ పేర్కొన్నారు. నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే రాజధాని కృష్ణాతీరంలో ఉంటుంది అన్నారు కాబట్టి దీనిలో రహస్యం ఏమి లేదు అని కోర్టు వ్యాఖ్యానించడం సరికాదని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలోనే రాజధాని వస్తుంది అనే సమాచారం ఆ ప్రకటన ద్వారా తెలిసే అవకాశం లేదనీ అందు వల్ల తుది నిర్ణయం తీసుకునే వరకూ రాజధాని అంశం రహస్యంగానే సాగిందని, సెక్యురిటీలను షేర్ల విషయంలో ఉండే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఈ అంశాలకు వర్తించదు అని కోర్టు పేర్కొన్నదన్నారు.

ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన రహస్య సమచారంతో లబ్దపొందడమే నేరంగా భావించినప్పుడు ప్రభుత్వంలోని రహస్య సమాచారంతో లబ్దిపొందడం అంతకు మించిన నేరమే అవుతుందని ఐవైఆర్ పేర్కొన్నారు. అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో కోర్టు తీర్పు ఒక్క అమరావతి అంశానికే పరిమితం కాదనీ రేపు ఏ ప్రాజెక్టు విషయంలోనైనా రహస్య సమాచారం ఉన్న ఏ అధికారి అయినా చుట్టుపక్కల భూములు కారుచౌకగా కొని ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఎక్కువ ధరలకు అమ్ముకున్నా ఈ తీర్పు ప్రకారం చట్టరీత్యా నేరం కాదన్న భావన వస్తుందన్నారు. దాని పరిణామాలు పాలనా వ్యవస్థపై విపరీతంగా ఉంటాయన్నారు ఐవైఆర్ కృష్ణారావు.

ఇప్పటికే ఐవైఆర్ లాంటి మేధావులు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని వైసీపీ ప్రభుత్వ పెద్దలకు సూచనలు చేశారనీ, ప్రభుత్వ న్యాయ నిపుణులు కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N