NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

వాటే వండర్!తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టిక్కెట్లకు పోటాపోటీ! జీవన్ రెడ్డి నేతృత్వంలో ఫిల్టర్ కమిటీ!!

ఆంధ్రప్రదేశ్లో దుకాణం సర్దేసిన కాంగ్రెసు పార్టీ తెలంగాణలో మాత్రం ఇంకా ఉనికి చాటుకుంటోంది.రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు అసెంబ్లీ ,లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బోణీ కొట్టలేకపోయింది.

నిజానికి తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసేసి రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్నారు.అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గణనీయమైన అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటూ వస్తోంది.గత లోక్సభ ఎన్నికల్లో అయితే రెండు పార్లమెంటు సీట్లలో ఘనవిజయం సాధించింది.ఇప్పుడు త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌లో ఈ సారి ఎన్నడూ లేని విధంగా ఆశావ‌హులు పెద్దఎత్తున ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి- హైద‌రాబాద్ కు, వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్ల‌గొండ ల‌కు చాలా మంది నేతలు పోటీకి తహతహ లాడుతున్నారు.

కొనసాగుతున్న ఫిల్టర్ ప్రక్రియ!

రెండు స్థానాల‌కు పెద్ద ఎత్తున ఆశావ‌హులు ఉండ‌టంతో వాటిని ఫిల్టర్ చేసి.. అభ్యర్థిని ఎంపిక చేయాలని ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్‌ ఠాగూర్ రాష్ట్రానికి వచ్చారు . గాంధీభవన్‌లో రెండ్రోజుల పాటు ముఖ్య నేతలు మరియు.. ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఆయా జిల్లా నేతలతో ఠాగూర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.అయితే.. ఈ సమీక్ష సమావేశంలో అభ్యర్థుల ఎంపిక అంశం ఎటూ తేల్చలేక పోయారు ఠాగూర్. కాంగ్రెస్‌ సీనియర్లతో ఏకాభిప్రాయం సాధించలేక పోయారు. చివరికి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించి.. ఆ కమిటీకి బాధ్యతలు అప్పజెప్పారు. జీవన్ రెడ్డి కమిటీని రెండ్రోజుల పాటు ఆయా జిల్లా నేతలతో సంప్రదింపులు జరిపి ఫైనల్ గా హైకమాండ్ కు షార్ట్ లిస్ట్ పంపాలని ఆదేశించారు ఠాగూర్.

కాంగ్రెస్ నేతల పెదవి విరుపు!

మరోవైపు.. మాణిక్యం ఠాగూర్‌నిర్ణయం కాంగ్రెస్ నేతలకు రుచించడం లేదు.దీనిపై అగ్రనేతలంతా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం రెండ్రోజులు సమీక్ష జరిపి చివరికి జీవన్ రెడ్డి కమిటీని వేసి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్‌ సీనియర్లు. జీవన్ రెడ్డి కమిటీ వేయడానికి ఆయన హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఠాగూర్ తీర్చలేని ఎమ్మెల్సీ అభ్యర్థుల చిక్కుముడిని జీవన్ రెడ్డి కమిటీ విప్పుతుందా అని ప్రశ్నిస్తున్నారు.మొత్తం మీద రెండు స్థానాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అభ్యర్థుల ఎంపిక విష‌యంలో కాంగ్రెస్‌లో పెద్ద దుమార‌మే రేగుతోంది. ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకు పోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికనే తేల్చలేకపోతుంది.

 

Related posts

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !