Yash Remuneration: కన్నడ సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే కేజిఎఫ్ సినిమా ముందు కేజిఎఫ్ సినిమా తరువాత అనే అంతలా ఈ సినిమా కన్నడ సినీ పరిశ్రమకు గుర్తింపును తెచ్చి పెట్టింది. అప్పటి వరకు భారీ బడ్జెట్ అంటే ఐదు నుంచి పది కోట్లతో సినిమా తీసేవారు. అలాంటి కన్నడ చిత్ర పరిశ్రమలో కేజీయఫ్ ఛాప్టర్ 1 ప్యాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలోనూ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దీంతో ఒక్కసారిగా భారతదేశ చిత్ర పరిశ్రమ ద్రుష్టి శాండిల్ వుడ్ ఇండస్ట్రీ మీద పడింది. త్వరలోనే కేజిఎఫ్ చాప్టర్ 2 ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులలో అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమాను ఈ ఏడాది జూలై 16 న విడుదల చేయనున్నారట. ఇంతకీ హీరో యష్ రెమ్యునరేషన్ Yash Remuneration ఎంత?
ఈ సినిమాలోని రాకీభాయ్ పాత్రలో కనిపించే రాకింగ్ స్టార్ యష్ కు ఈ సినిమా తరువాత కోట్లమంది అభుమానులు దక్కారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ తనదైన నటనతో ఆ పాత్రకి ప్రాణంపోశాడని చెప్పవచ్చు. ఈ సినిమా రెండు చాఫ్టర్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అందరిలోనూ ఓ ప్రశ్న తలెత్తుతుంది. ఈ రెండు పార్ట్స్ ని నిర్మించడానికి దాదాపు నాలుగు సంవత్సరాల సమయం పట్టినందున ఈ సినిమా కోసం హీరో యష్ రెమ్యునరేషన్ ఎంత అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిందని నిస్సందేహంగా చెప్పవచ్చు..
అయితే ప్రస్తుతం శాండిల్‌వుడ్ లో వినిపిస్తిన్న వర్గాల ప్రకారం హీరో యష్ కేజీయఫ్ చాప్టర్ 2 కోసం ఏకంగా ముప్పై కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడట. అలాగే సినిమా లాభాల్లోనూ యష్ కి వాటా ఇచ్చేలా నిర్మాతలు ప్రామిస్ చేశారని అంటున్నారు. ఇది మనకి అంత పెద్ద విషయం కాకపోయినా శాండిల్‌వుడ్ లో మాత్రం ఇది చాలా పెద్దమొత్తం అని చెప్పొచ్చు.