Khiladi : ఖిలాడి తో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులకు వచేందుకు రెడీ అవుతున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఇప్పటికే క్రాక్ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న రవితేజ వరుసపెట్టి క్రేజీ ఆఫర్లను అందిపుచ్చుకుంటూ స్క్రీన్ మీద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. థ్రిల్లర్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఖిలాడీకి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరీలు హీరోయిన్స్ గా ఫిక్స్ అయ్యారు. ఇక కీలక పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తదితరులు కనిపించనున్నారు.
కాగా వీరితో పాటే ఖిలాడీలో ఓ కీలక పాత్రను పోషించే బంపర్ ఆఫర్ ను కొట్టేసింది హాట్ అనసూయ. రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా అందరి ప్రశంసులు అందుకుంది అనసూయ. అప్పటి నుంచి సినిమాల్లో వరుస ఆఫర్లు అందివచ్చినా, అనసూయ మాత్రం పాత్ర చిన్నదైనా ఫరవాలేదు తనకు ప్రియారిటీ ఉండే క్యారెక్టర్లను ఎన్నుకుంటూ వెండితెరపై అలరిస్తోంది. ఇప్పటికే అనసూయ పోషించిన పలు పాత్రలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఇటు బుల్లి తెరే కాదు వెండితెరపైనా …తన అందచందాలతో హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసే అనసూయ ఏ క్యారెక్టర్ ఇచ్చినా అల్లుకుపోతూ ముందుకు దూసుకెళుతోంది.
Khiladi : అనసూయ నెగిటివ్ రోల్ పోషించనుందని టాక్ వినిపిస్తోంది.
అమ్మడు అందం ప్లస్ కావడంతో వెండితెరపై ఓ వెలుగు వెలుగుతోంది. ఇక ఖిలాడీలోనూ కీలక పాత్రలో కనిపించనుంది అనసూయ. మూవీ యూనిట్ కూడా ఇప్పటికే ప్రకటన కూడా చేసేసింది. ఈ చిత్రంలో అనసూయనే గేమ్ ఛేంజర్ అని డైరెక్టరే స్వయంగా వెల్లడించాడు. దీనిని బట్టి చూస్తే అనసూయ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించనుందని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఎలాంటి రోల్ కనిపించబోతోందో. ఇక అనసూయ ప్రస్తుతం రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం తో పాటు చావు కబురు చల్లగా అన్న సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించబోతోంది.