NewsOrbit
Featured రాజ‌కీయాలు

Nimmagadda Ramesh Kumar : గంటకో గొడవ.. రోజుకో రగడ..! నిమ్మగడ్డ జెండా.., వైసీపీ అజెండా మారేది ఎన్నడో..!?

Nimmagadda: Last Bomb on AP Govt

Nimmagadda Ramesh Kumar.. కు ప్రభుత్వానికి గంటకో గొడవ.. రోజుకో రగడ జరుగుతోంది.  నిమ్మగడ్డ జెండా.. వైసీపీ అజెండా రెండింటి మధ్యా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పంచయితీ రోజుకో మలుపు తిరుగుతోంది. దాదాపు ఏడాదిగా అనేక మలుపులు తిరిగిన ఎన్నికల ప్రహసనం ఏపీ చరిత్రలో అత్యంత వివాదాలమయంగా నిలిచిపోయేలా జరుగుతోంది. పంతాలు, పట్టింపులు, వాదోపవాదాలు, విమర్శ-ప్రతివిమర్శలు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తీర్పుల వరకూ వెళ్లింది.

నిజానికి ఈ తతంగం రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్ వ్యవహారంకు సంబంధించింది. కానీ.. సీఎం జగన్ వర్సెస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లా సాగిపోయింది. ప్రాధమిక పోరులో జగన్ పై నిమ్మగడ్డ పైచేయి సాధించారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిమ్మగడ్డ వెళ్తున్నా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, జారీ చేస్తున్న ఉత్తర్వులు వివాదాస్పదం అవుతున్నాయి. అందులో ఏకగ్రీవాలైన పంచాయతీలపై ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఉత్తర్వులు ఉన్నాయి. ఇప్పుడీ అంశంపై ప్రభుత్వం సీరియస్ అవుతోంది.

 

Nimmagadda Ramesh Kumar ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ హుకూం..

ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏకగ్రీవాలపై దృష్టి సారించింది. గతంలోలేని విధంగా పంచాయతీలను నాలుగు దశలుగా విభజించి ప్రోత్సాహక నగదు మొత్తాలను పెంచింది. ఏకగ్రీవాలు ఎక్కువ జరిగేలా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇందులో భాగంగా  తొలివిడతకు సంబంధించి కొన్ని పంచాయతీల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకే ఏకగ్రీవాలు ఎక్కువ అవుతాయి.. ఇది సహజమే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తొలివిడతలో ఎన్నికలు జరుగుతున్న గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీలు ఉన్నాయి.

ap government vs election commission rivalry continues
ap government vs election commission rivalry continues

తెనాలి డివిజన్ లో 337 పంచాయతీలకు 67, 3442 వార్డులకు 1337 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ 67 మందిలో 63 మంది అధికార పార్టీకి మద్దతిచ్చారు. నలుగురిలో ఇద్దరు టీడీపీ, మరో ఇద్దరు స్వతంత్రులు. చిత్తూరు డివిజన్ లో 545 పంచాయతీలకు 112 ఏకగ్రీవమయ్యాయి. 112లో 95 వైసీపీకి, 13 టీడీపీ.. నలుగురు స్వతంత్రులు. ఇక్కడే వివాదం మొదలైంది. ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు.. బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకోమన్న ఎన్నికల కమిషన్.. ఇప్పుడీ ఏకగ్రీవాల ఫలితాలు ప్రకటించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ap government vs election commission rivalry continues
ap government vs election commission rivalry continues

నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..

టీడీపీ అజెండాను మోస్తూ.. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నారని మండిపడ్డారు. సగం తెలిసీ తెలియన తనం, అహం, బ్లాక్ మెయిలింగ్, టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించడం తప్పితే నిమ్మగడ్డకు తిలిసిందేమీ లేదు. చేస్తున్న పాపాలు కడుక్కునేందుకే ఏపీలోని దేవాలయాలకు వెళ్తున్నారు.. అంటూ తీవ్రస్థాయిలో నిమ్మగడ్డపై మండిపడ్డారు. ఈ వాచ్ యాప్ ను ఉపయోగించొద్దని హైకోర్టు చెప్పడమే నిమ్మగడ్డ నైజాన్ని చెప్తోందని.. ఈ యాప్ ను చంద్రబాబు ఆధ్వర్యంలోనే రూపొందించారని ఆరోపించారు. తన ఓటు హైదరాబాద్ లో ఉంటే స్వగ్రామంలో ఇవ్వాలని అడిగే వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా ఉండటం దురదృష్టకరమని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రావాలు జరగడం సహజమే అని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2013లో 12,740 స్థానాల్లో 1980 వరకూ ఏకగ్రీవాలు అయ్యాయని.. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వీటిని అడ్డుకోవడం ఏంటన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఏకగ్రీవాలు చట్టవిరుద్దమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. నిమ్మగడ్డ తీరును ప్రశ్నిస్తూ ఎండగడుతూనే ప్రభుత్వపరంగా ఏకగ్రీవాలను ప్రకటించడం ఆపొద్దని అంటున్నారు పెద్దిరెడ్డి.

 

మధ్యలో ఇబ్బందిపడుతున్న అధికారులు..

నిమ్మగడ్డ ఆదేశాలను పాటించి ఏకగ్రీవాలు అడ్డుకోవద్దని అధికారులను ఆదేశిస్తున్నారు నిమ్మగడ్డ. ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని అంటున్నారు. ఏకగ్రీవాలైన అభ్యర్ధులకు డిక్లరేషన్ ఇవ్వకపోతే మార్చి 31 తర్వాత ఆ అధికారులకు తగిన గుణపాఠం చెప్తామంటున్నారు. దీంతో అడకత్తెరలో పోకచెక్క అనే సామెత చందాన అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఒకరు ప్రభుత్వం.. మరొకరు రాజ్యాంగ వ్యవస్థ. నిమ్మగడ్డ ఆదేశాలు పాటించకపోతే ఇప్పుడు ఇబ్బంది.. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే.. మార్చి 31 నుంచి ఇబ్బంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు అధికారులు. రెండు వ్యవస్థల మధ్య జరుగుతున్న పోరాటంలో అధికారులు ఏం చేస్తారో.. ఎవరి ఆదేశాలను పాటిస్తారో చూడాల్సి ఉంది.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju