NewsOrbit
న్యూస్

Miss India : మిస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకున్న మన తెలుగింటి ఆడబిడ్డ..!

who-is-manasa-varanasi

Miss India : ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆడపిల్లలు కేవలం కొన్ని రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించి వారి సత్తాచాటుకున్నారు. కానీ ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలో కూడా తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎంతోమంది గొప్పవాళ్లు వస్తుంటారు. అయితే వాళ్లందరి ముందు నిలబడి నేడు మిస్ ఇండియా టైటిల్ ని ఒక తెలుగింటి ఆడపిల్ల సొంతం చేసుకున్నారు.ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా మానస వారణాసి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

who-is-manasa-varanasi
who-is-manasa-varanasi

హైదరాబాద్ కి చెందిన మానస చిన్నప్పటి విద్యాభ్యాసం మొత్తం గ్లోబల్ ఇండియన్ స్కూల్ లో పూర్తి చేశారు. అయితే తనకు ఆర్థిక రంగంపై ఎంతో ఆసక్తి ఉండటం వల్ల మానస వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఎకనామిక్స్ లో పట్టభద్రులయ్యారు.ఆమె ప్రస్తుతం ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్స్ఛేంజ్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పుడు ఎంతో మొహమాటంగా ఇతరులతో మాట్లాడటానికి కూడా ఎంతో ఇబ్బంది పడే మానస తన స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం కోసం తన దృష్టిని భరతనాట్యం వైపు మళ్ళించారు.ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పటికి కూడా ఫ్యాషన్ రంగం పై ఎలాంటి అవగాహన లేకపోయినప్పటికీ కళాశాలలో మొదటిసారిగా ర్యాంప్ వాక్ నడిచి బహుమతి గెలుచుకున్నారు.

తన జీవితంలో ఈ ముగ్గురు ఎంతో ప్రత్యేకం:

ఈ విధంగా బహుమతులు గెల్చుకోవడంతో 21 సంవత్సరంలో తనకి మోడలింగ్ పై ఆసక్తి కలిగిందని ఓ సందర్భంలో తెలియజేశారు. ప్రస్తుతం మానస ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు గల కారణం తన సోదరి, తన అమ్మ, బామ్మ ముగ్గురు కారణమని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. వీరి ప్రోత్సాహం వల్లనే ప్రస్తుతం తను ఫ్యాషన్ రంగంలో రాణించాగలగానని తెలిపారు.2014 జూన్‌ 13 నుంచి మానస ఇన్‌స్టాలో ఖాతాను ప్రారంభించారు. సాధారణంగా సోషల్‌మీడియాలో తక్కువగా కనిపించే మానస సమయానికి అనుగుణంగా ఫోటోలను షేర్ చేసే వారు.

మోడలింగ్ పై అవగాహన, ఆసక్తి రావడంతో తన శరీర ఫిట్ నెస్ పై శ్రద్ధ తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిని త్రాగటంతో తన దినచర్యను ప్రారంభించేవారు. ఎప్పుడైనా మానసికంగా ఆందోళన చెందుతున్నపుడు, అధిక ఒత్తిడికి లోనైనప్పుడు తన దృష్టిని మొత్తం సంగీతం వైపు మళ్ళించేదని తెలిపారు. అదేవిధంగా హీరోయిన్ ప్రియాంక చోప్రా అంటే తనకెంతో ఇష్టమని తనే రోల్ మోడల్ అంటూ ఈ ఫెమినా మిస్‌ ఇండియా తెలియజేశారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella