NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : కేసీఆర్ స‌ర్‌… పుట్టిన రోజు స‌రే ఈ ర‌చ్చ సంగ‌తేంది ?

KCR : ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణులు కార్య‌క్ర‌మాలు చ‌ర్చ‌కు తెర‌లేపుతుటుంటే మ‌రోవైపు పార్టీ కి త‌ల‌పోటుగా మారుతున్న ఇంకొన్ని సంఘ‌ట‌న‌లు సైతం అదే స‌మ‌యంలో మీడియాలో నిలుస్తున్నాయి.

KCR
KCR

కేసీఆర్ పుట్టిన రోజు ఒక‌టి రెండు రోజుల ముందే అన్న‌ట్లుగా వ‌రుస‌గా జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌లు పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లానికి దారి తీస్తున్నాయి. మేయర్ పదవి రాగానే గద్వాల్ విజయలక్ష్మి ప్రతీకారం తీర్చుకున్నారని, తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మార్వోని విజయలక్ష్మి బదిలీ చేయించారని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం స‌ద్దుమ‌ణుగుతున్న స‌మ‌యంలోనే… మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బదిలీ పై వెళ్ళిన సూపరిండెంట్ డాక్టర్ భీం సాగర్ మాటలు ఇప్పుడు జిల్లా లో హాట్ టాపిక్ గా మారాయి

KCR ముందు ఆ మేడ‌మ్‌…

షేక్ పెట్ తహసీల్దార్ బదిలీ విష‌యంలో పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయిన నేప‌థ్యంలో హైద‌రాబాద్ మేయ‌ర్ స్పందించారు. బదిలీ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవహారం దాంట్లో త‌నకు ఎలాంటి పాత్ర లేదని అన్నారు. తహసీల్దార్ తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు అని మీడియాలో చెప్పారని గుర్తు చేశారు. బ‌దిలీ విష‌యంలో త‌న‌ ప్రమేయం ఏమి లేదని, దీనిపై తాను ఎవరితో మాట్లాడలేదని మేయ‌ర్ అన్నారు.

ఇప్పుడు ఇంకో మేడమ్‌…

మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ భీం సాగర్ బ‌దిలీ అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ సుదీర్ఘంగా పనిచేశానని, ఆసుపత్రి అభివృద్ధికి అప్పటి మంత్రి రెడ్యానాయక్ , MP కవిత, MLA శంకర్ నాయక్ , కలెక్టర్లు ప్రీతీ మీనా, గౌతమ్ ల సహకారం తో ఎనలేని కృషి చేశానని అన్నారు. త‌న బదిలీకి స్థానిక మంత్రి సత్యవతి రాథోడే కారణమని, మంత్రి బంధువుకు సూపరిండెంట్ పదవిని కట్టబెట్టేందుకే మంత్రి నన్ను బదిలీ చేయించారని ఆరోపించారు. మంత్రి సత్యవతి రాథోడ్ నన్ను టార్గెట్ చేసి మానసికంగా వేధించారని, మంత్రి కుమారుడు ఛాతీ వైద్య నిపుణుడుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తూ నెలకు వారం రోజుల మాత్రమే డ్యూటీ కి వస్తాడని అన్నారు. నెల రోజుల జీతం ఇవ్వాలని అధికారులపై వత్తిడి తెస్తాడని, అలా ఇవ్వకపోవడంతోనే నన్ను టార్గెట్ చేశారని ఆరోపించారు. అంతే కాదు ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే మహబూబాబాద్ ఏరియా హస్పిటల్ నూతన సూపరిండెంట్ డాక్టర్ వెంకట్రాములు మాత్రం మంత్రి సత్యవతి రాథోడ్, కుమారుడు డాక్టర్ సతీష్ పై బదిలీ పై వెళ్ళిన సూపరిండెంట్ డాక్టర్ భీం సాగర్ అభాండాలు వేయడం తగదని అన్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju