NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Cabinet : ఈబీసీ మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

AP Cabinet : ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదించింది. వచ్చే మూడేళ్లలో 45 నుండి 60 సంవత్సరాలలోపు మహిళా లబ్దిదారులకు ఈ పథకం ద్వారా రూ.45వేలు అందించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగుల లోపు ఉంటే..రూపాయికే లబ్దిదారులకు ఇల్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

AP Cabinet decisions
AP Cabinet decisions

అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 50శాతం నిర్మాణం పూర్తి అయి పెండింగ్ లో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి ఏఎంఆర్‌డీఏకు రూ.3వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికీ ప్రారంభం కాని, కొద్దిగా ప్రారంభమైన నిర్మాణలపై ఇంజనీరింగ్ అధికారుల నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ లో అభిప్రాయపడినట్లు సమాచారం. నవరత్నాలు అమలు క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

AP Cabinet decisions
AP Cabinet decisions

కాకినాడ ఎస్ఈజడ్ భూముల వ్యవహారానికి సంబంధించి నివేదికను మంత్రి కన్నబాబు కమిటీ కేబినెట్‌కు సమర్పించింది. రైతులు ఇచ్చిన 2,180 ఎకరాలను వెనక్కి ఇచ్చేయాలని కమిటీ సూచించింది. వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju