NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

Kuppam TDp : “న్యూస్ ఆర్బిట్” బ్రేకింగ్ : కుప్పం టీడీపీలో భారీ కుదుపు..! పార్టీకి కీలక నేతల రాజీనామా..!?

Kuppam TDP - Leaders Resigned Exclusive

Kuppam TDP : ఓ ఓటమి పార్టీకి కుదిపేసింది. ఓ ఓటమి నేతలను కిందకు దించుతుంది. ఓ ఓటమి పార్టీలో కప్పేసిన నిజాలను బయట పెడుతుంది. కుప్పం టీడీపీలో ఇదే జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఆ నియోజకవర్గ టీడీపీని అతలాకుతలం చేసింది. ఈరోజు జరిగిన పార్టీ అంతర్గత సమావేశం ఆ నియోజకవర్గ కీలక నేతల నలుగురి రాజీనామాకు దారి తీసింది. కార్యకర్తల నిలదీతకు వేదికయింది. “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా సేకరించి వివరాలు ఇలా ఉన్నాయి..!!

Must Read : కుప్పంలో ఏం జరిగింది..!? టీడీపీ ఎందుకు ఓడింది..!? “న్యూస్ ఆర్బిట్” కీలక విశ్లేషణ..!! 

Kuppam TDP - Leaders Resigned Exclusive
Kuppam TDP – Leaders Resigned Exclusive

Kuppam TDP : నాయకుల నిలదీత..! రాజీనామా..!!

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, కార్యకర్తల పనితీరు, నాయకుల వ్యవహారశైలిపై సమీక్ష చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 25 , 26 తేదీల్లో కుప్పం పర్యటన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మంగళవారం సాయంత్రం) సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు మండలాల కార్యకర్తలతో ఆ నాలుగు మండలాల పార్టీ ఇంచార్జీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తల ఆగ్రవేశాలు బయటపడ్డాయి. నాయకులు అధికార పార్టీకి అమ్ముడుపోయారని.. నాయకుల నిర్లక్ష్యం వల్లనే పార్టీ ఓడిపోయింది అంటూ కార్యకర్తలు నిలదీశారు. నాలుగు గోడల మధ్య, ఆఫ్ ది రికార్డు నిర్వహించిన సమావేశం కావడంతో కార్యకర్తలు చాలా మంది ఓపెన్ అయిపోయారు. మండలాలకు ఇంచార్జిలుగా ఉన్నా నాయకులు ఎవరెవరు .. ఏ విధంగా అధికార పార్టీకి అమ్ముడుపోయారో.., ఎవరెవరు ఏం చేశారో తెలుసు అంటూ కొందరు కార్యకర్తలు గట్టిగానే నిలదీశారు. ఇంకొందరు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు గంటన్నర పాటూ కార్యకర్తల నుండి తిరుగుబాటు ఎదురయింది. దీంతో ఆ నలుగురు నాయకులు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Must Read : జగన్ పగా..? పెద్దిరెడ్డి ప్రతీకారం..!? కుప్పంపై న్యూస్ ఆర్బిట్ రిపోర్ట్..!! 
Kuppam TDP - Leaders Resigned Exclusive
Kuppam TDP – Leaders Resigned Exclusive

నలుగురే నాలుగు స్తంభాలు..!!

కుప్పంలో చంద్రబాబు ఉండరు, ప్రచారం చేయరు, ఏడాది మొత్తం మీద పది, పదిహేను రోజులు మాత్రం ఉంటారు. కానీ గెలుస్తారు. దానికి కారణం కార్యకర్తల బలం, నాయకుల పనితీరు. పార్టీ అధికారంలో ఉండడంతో.. ప్రత్యర్థి పార్టీ గట్టిగా దృష్టి పెట్టకపోవడంతో ఇన్నాళ్లు నాయకుల వ్యవహారాలు బయటకు రాలేదు. ఇటీవల పెద్దిరెడ్డి నేతృత్వంలోనే వైసిపి బృందం కుప్పంపై సీరియస్ ఫోకస్ పెట్టడంతో కుప్పం కోట బద్దలయింది. కూపీ బయటకు వచ్చేసింది. దీంతో నాలుగు మండలాల ఇంచార్జిల కారణంగానే పార్టీ ఓడింది అంటూ కార్యకర్తలు రగిలిపోతున్నారు. కుప్పం నియోజకవర్గంలోని బోడుపల్లి, శాంతిపురం, కుప్పం, రామకుప్పం నాలుగు మండలాలకు ఎమ్మెల్సీ శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్, మునిరత్నం, తదిరతులు ఇంచార్జిలుగా ఉన్నారు. తాజాగా కార్యకర్తలు వీరిపై తిరుగుబాటు చేశారు. మీ అవినీతి వ్యవహారాలు, మీ లోపాలు, మీ ప్రలోభాల కారణంగా పార్టీని సరిగా పట్టించుకోలేదు… పైగా కార్యకర్తలనే నిందిస్తారా..? ఓటమి బాధ్యత మీదే అంటూ కార్యకర్తలు తిరుగుబాటుతో ఆ నాలుగు నేతలు రాజీనామా చేసినట్టు తెలిసింది. మొత్తానికి మూడున్నర దశాబ్దాల కుప్పం కోటాలో కుదుపు చంద్రబాబుకి చాలా తలనొప్పి వ్యవహారంగా మారింది..!!

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju