NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Accident Case : అత్యాశకు పోయి బంగారాన్ని నొక్కేశారు..! వెంటనే దొరికిపోయారు..!!

Accident Case : రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే ఎందరినో సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్షించే వృత్తిలో ఉన్న 108 సిబ్బంది రోడ్డు ప్రమాద బాధితుల నుండి బంగారాన్ని కొట్టేసి అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే..పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపిలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారులు కొత్త శ్రీనివాసరావు (55), రాంబాబు (45) మృతి చెందారు. ఈ ఘటనలో వారి గుమాస్తా గుండా సంతోష్, కారు డ్రైవర్ డి సంతోష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కొన ఊపిరితో ఉన్న రాంబాబు, గుండా సంతోష్, డి సంతోష్ లను 108 అంబులెన్స్ లో గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వద్ద ఉన్న బంగారు నగలను 108 సిబ్బంది ఎస్ఐ శైలజకు అందజేశారు.

Accident Case : 108 staff are the gold thieves
Accident Case : 108 staff are the gold thieves

బాధితుల బంధువులు ఆసుపత్రికి చేరుకున్న తరువాత తమ వారి వద్ద 5కేజీల 600 గ్రాముల బంగారం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. 108 అంబులెన్స్ సిబ్బంది   3కేజీల 300 గ్రాముల బంగారం మాత్రమే ఇవ్వగా, మిగిలిన 2కేజీల 300 గ్రాముల బంగారం ఏమైనట్లు అన్న సందేహం వ్యక్తం అయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసును 24 గంటల్లో ఛేదించారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మారెడ్డి, ఎమర్జెన్సీ టెక్నిషియన్ తాజుద్దీన్ ను పోలీసులు విచారించగా మిగిలిన 2 కేజీల 300 గ్రాముల బంగారం తమ వద్దనే ఉందని అంగీకరించారు. వారి వద్ద నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Accident Case : 108 staff are the gold thieves
Accident Case : 108 staff are the gold thieves

బంగారంకు సంబంధించిన అన్ని బిల్లులను పరిశీలించి బాధితుల బంధువులకు బంగారం అప్పగిస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రమాదం నుండి ఎంతో మందిని కాపాడిన 108 సిబ్బంది అత్యాశకుపోవడం వల్ల వారికి చెడ్డపేరు వచ్చేలా చేసిందని అన్నారు. అత్యవసర సేవలు అందించే వారు ఇలాంటి పనులు చేయకూడదని హితవుపలికారు సీపీ సత్యనారాయణ.

Related posts

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N